ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం.
చందుర్తి, నేటిధాత్రి:
ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా చందుర్తి మండలకేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ వీర నారి అని తొలి తెలంగాణ రైతు సాయుధ పోరాట యోధురాలని ఆమె తెగువ ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆ రోజుల్లోనే ఒక మహిళ అయి ఉండి ఎందరో పెత్తందారులతో దొరలతో రజాకాలతో పోరాడి వేలాది ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేశారని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో చందుర్తి మండల రజక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు సుద్దాల నరసయ్య మరియు కోశాధికారి కొడగంటి గంగాధర్, చందుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు లింగంపల్లి మల్లయ్య, మరియు చందుర్తి గ్రామ శాఖ రజక సంఘం సభ్యులు, యువకులు, చందుర్తి తాజా మాజీ నాయకులు పులి సత్యం, తిప్పని శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్, గొట్టే ప్రభాకర్, బత్తుల కమలాకర్, చిర్రం తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.