భారత్-న్యూజిలాండ్ ఆఖరి టీ20.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు..

భారత్-న్యూజిలాండ్ ఆఖరి టీ20.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు!

 

 

 

భారత్-న్యూజిలాండ్ జట్లు శనివారం తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో తలపడనున్నాయి. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆఖరి పోరులో గెలిచి.. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026ను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు శనివారం తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో తలపడనున్నాయి. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో కివీస్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే నామమాత్రపు ఈ ఐదో టీ20లో భారత్ గెలిచి.. విజయంతో సిరీస్‌ను ముగించాలని చూస్తోంది. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026( T20 World Cup 2026)ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. కాగా ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
అయితే నేడు జరిగే ఐదో టీ20లో భారత జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ విఫలమైన సంజు శాంసన్‌కు మరో అవకాశం దక్కనుంది. ఇందులోనైనా ఫామ్ అందుకుని సంజు తనను తాను నిరూపించుకోవడానికి ఓ చక్కటి అవకాశం. నాలుగో మ్యాచులో విశ్రాంతి తీసుకున్న ఇషాన్ కిషన్.. ఐదో టీ20లో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టీ20లో చేతి వేలికి గాయం అవ్వడం వల్ల ఆటకు దూరమైన అక్షర్ పటేల్.. ఈ మ్యాచులో ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. తొలి నాలుగు టీ20ల్లో ఆడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ఐదో టీ20లో విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version