కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్టు ముందు నిరవధిక సమ్మె…

కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్టు ముందు నిరవధిక సమ్మె

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని చెప్పి మోసం చేసింది ఎన్నికల సమయం లో ఇప్పుడు అధికారం లో వున్నా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మేము అధికారం లోకి వచ్చాక ఎలక్రిసిటీ డిపార్ట్మెంట్ లో వున్నా 23వేల మంది ఆర్టిజన్ కార్మికులను పేర్మినెంట్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం చేసినట్టే ఇ ప్రజా ప్రభుత్వం కూడా మోసం చేసింది. దీనిలో భాగంగా గత నెల 17వ తారీకు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నే ఇ రోజు కే టి పి పి ప్రధాన గేటు ముందు ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చెయ్యడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం లో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎస్ సతీష్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, చింత ఎల్లయ్య, ప్రశాంత్ మరియు కేటీపీపీ జేఏసీ నాయకులు ఆర్టిజన్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version