జోరు వర్షంలో..స్వీట్కార్న్ వడలు ఇలా ట్రై చేయండి!…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T112346.147.wav?_=1

 

జోరు వర్షంలో..స్వీట్కార్న్ వడలు ఇలా ట్రై చేయండి!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

చిటపట వర్షంతో వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుంది. ఈ చలిలో చక్కగా వేడి వేడి పకోడీలు లేదా అప్పుడే కాల్చిన మొక్కజొన్న కంకిలు తింటుంటే సామిరంగా..ప్రాణం భలే హయిగా ఉంటుంది. ప్రస్తుతం ఉరుకులు పరుగులు జీవితం కారణంగా అలాంటి ఆనందాలే మరిచిపోతున్నాం. దీనికి తోడు అందరూ ఉద్యోగాలు, చదువులు పేరుతో పట్టణాల బాటపట్టడంతో..అవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది.

 

 

ఐతే పట్టణాల్లో వాటి ప్లేస్లో మార్కెట్లో ఎక్కువగా స్వీట్కార్న్లు వచ్చాయి. కనీసం వీటితో ఈ జోరు వానలో నాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు హాయిగా. ఈ స్వీట్ నాటు మొక్కజొన్నలు స్థానంలో వచ్చిన ఈ స్వీట్ కార్న్లతో అలనాటి ఆ సంతోషాన్ని ఆస్వాదిద్దామా! ఇక ఆలస్యం ఎందుకు వాటితో చేసే స్నాక్ ఐటెం ఏంటో చూసేద్దాం

స్వీట్ కార్న్ వడలు తయారీ విధానం

కావాల్సిన పదార్థాలు

స్వీట్ కార్న్ పెద్దది-ఒకటి

జీలకర్ర- 1 టేబుల్ స్పూన్

ఎండు మిర్చి పొడి-1 టేబుల్ స్పూన్

సెనగపిండి- 3 టేబుల్ స్పూన్

బొంబాయి రవ్వ-1 టేబుల్ స్పూన్

బియ్యపిండి-1 టేబుల్ స్పూన్

సన్నగా తరిగిన కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ (సరిపడా)

తయారీ విధానం: స్వీట్కార్న్ఉడికించుకుని వలిచి మెత్తగా

రుబ్బుకోవాలి. ఆ తర్వాత పైన చెప్పినవి ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని, రుబ్బిన స్వీట్కార్న్ మ్రిమంలో కలుపుకోవాలి.,రుచికి సరిపడా ఉప్పు వేసి వడలు మాదిరిగా చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి లేదా నాన్స్టిక్ పాన్లో కొద్ది మోతాదు. ఆయిల్ వేసుకుని డీప్ ఫై చేసుకోవాలి. ఆ తర్వత వాటిని టమాటా, పుదీనా చెట్నీ గానీ, టమాటా కెచప్తో గాని తింటుంటే ఆ రుచే వేరబ్బా!

స్వీట్‌కార్న్.. మొక్కజొన్న.. రెండింటిలో ఏవి మంచివంటే..

 

దేశీబుట్ట అంటే మనకు వర్షాకాలంలో లభించే మొక్కజొన్న కంకులు అని అర్థం. అసలు చాలా మందిలో ఈ కంకులు తింటే మంచిదేనా అనే అనుమానం కలగడం సహజం. వీటితో పాటు స్వీట్‌కార్న్ కూడా ఎక్కువగా లభిస్తాయి.. ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచివంటే..

హైలైట్:

మొక్కజొన్నలో చాలా రకాలు

స్వీట్ కార్న్, మొక్కజొన్నలో ఏది ఆరోగ్యమంటే..

మొక్కజొన్న కంకుల బిజినెస్ కూడా విస్తరిస్తుంది. చాలా చోట్ల రహదారుల పక్కన మొక్క జొన్న కంకులను అమ్ముతూ ఉంటారు. ఈ మొక్క జొన్న కంకులలో కూడా రెండు రకాలు ఉంటాయి. అవి 1) స్వీట్ కార్న్ 2) దేశీబుట్టా. స్వీట్ కార్న్ అనేది ఏడాది పొడవునా, సీజన్ లతో సంబంధం లేకుండా మనకు లభిస్తూ ఉంటుంది. కానీ దేశీబుట్టా మాత్రం మనకు కేవలం వర్షాకాలం సీజన్ లో మాత్రమే లభిస్తుంది. కావున అనేక మంది వర్షాకాలం సీజన్ లో దేశీబుట్టా మొక్క జొన్న కంకులను తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఈ మొక్క జొన్న కంకులకు ధర కూడా అంతలా ఉండకపోవడంతో అనేక మంది ఈ వర్షకాలం సీజన్ లో వీటిని ఖరీదు చేసి రకరకాల ఆహార పదార్థాలు, పాయసాలు చేసుకుంటూ ఉంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మొక్క జొన్న కంకులు తినేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ మొక్క జొన్న కంకులతో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కేవలం ఈ మొక్క జొన్న కంకులను ఒక్క రోజు మాత్రమే తింటారు కనుక ఎటువంటి ఆందోళనలు, భయాలు పెట్టుకోకుండా తృప్తిగా వాటిని ఆరగిస్తారు. ఈ రెండు రకాల మొక్క జొన్న కంకులతో అనేక రకాల వెరైటీలను చేసుకోవచ్చు. కంకులతో పిండిలా చేసుకుని గారెలు లేదా వాటిని రుబ్బుకుని పాయసంలా చేసుకుని ఆరగిస్తారు. అంతే కాకుండా వేరే రకాల ఆహార పదార్థాలను కూడా చేసుకుంటారు.

 

 

కానీ కొంత మందిలో ఒక రకమైన సందేహం కలుగుతుంది. అసలు స్వీట్ కార్న్ మరియు దేశీబుట్టా జాతులలో ఏది ఆరోగ్యానికి మంచిది? అని. ఈ ప్రశ్నకు న్యూట్రీషియనిస్టులు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

మనకు ఏడాది పొడవున లభించే స్వీట్ కార్న్ కానీ కేవలం వర్షాకాలంలో మాత్రమే లభించే దేశీబుట్టాను కానీ తీసుకున్నపుడు దేని ప్రయోజనాలు దానికే ఉంటాయి. దేని ఆకర్షణ విధానాలు దానికే ఉంటాయి. కావున ఈ రెండు వెరైటీలలో ఏది ఉత్తమం అని చాలా మంది ఆలోచిస్తారు. ఒక వ్యక్తి రెండు రకాల వెరైటీలను తీసుకున్నపుడు ఏ వెరైటీ ఉత్తమంగా పని చేస్తుందనే విషయం గురించి ప్రముఖ సెలబ్రెటీ న్యూట్రీషియనిస్ట్ ఒకరు ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఆయన సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘ పోస్టును పంచుకున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం..

స్వీట్ కార్న్ ను హైబ్రిడ్ విత్తనాల నుంచి పండిస్తారు. ఈ జాతి మొక్క జొన్న కంకులు పెరిగేందుకు చాలా రకాల పోషకాలు అవసరం ఉంటాయి. ఇది చాలా తీపిగా ఉండడం వలన దీనిలో ఉండే పోషకాల సాంద్రత కూడా తక్కువగా ఉంటుంది. ఇది పండేందుకు మనం చాలా రకాల పురుగు మందులను వాడాల్సి వస్తుంది. ఇది పెద్ద మొత్తంలో పండించడం వలన దానిలో ఉండే పోషక విలువలు దెబ్బతింటాయి. ఇలా పురుగు మందులను అధికంగా వాడడం వలన పర్యావరణం దెబ్బ తింటుంది. మరియు వీటిల్లో ఉండే పోషక విలువలు హరించుకుపోతాయి. మరియు ఇందులో అధిక మొత్తంలో షుగర్ కంటెంట్, తక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని అంతగా ఎవరూ పట్టించుకోరని న్యూట్రీషియనిస్ట్ తెలిపారు.

మన దేశీయ మొక్క జొన్న రకం దేశీ బుట్టా విషయానికి వస్తే మాత్రం ఈ మొక్క జొన్న రకంలో దాదాపు 3000పై చిలుకు వెరైటీలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ జాతి మొక్క జొన్న పంటను పెంచడం చాలా సులువు. ఇది కేవలం నీరు, ఎరువు లతో సులభంగా పెరుగుతుందని న్యూట్రీషియనిస్ట్ వివరించారు. ఈ మొక్క జొన్న జాతిని ఇతర పంటలలో అంతర పంటగా కూడా వేస్తారు. ఇలా అంతర పంటగా వేయడం వలన ఇవి ఎటువంటి తెగుళ్లు సోకకుండా ఉండేందుకు సహాయపడతాయి. కావున వీటికి పురుగుమందులు ఎక్కువగా పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మొక్క జొన్న పొత్తులు స్వీట్ కార్న్లా కాకుండా పరిపక్వత చెంది ఉంటాయి. ఇందులో ఉండే పోషకాల వలన శరీరంలోని బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. స్వీట్ కార్న్ లో అధికంగా ఉండే షుగర్ స్థాయిలు ఈ జాతి మొక్క జొన్న కంకులలోకి వచ్చేసరికి కాంప్లెక్స్ స్టార్చ్లా మార్చబడతాయి.

దేశీ బుట్టాలో ఉన్న అధిక ఫైబర్ కంటెంట్ వలన మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. దీనివలన మన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని న్యూట్రీషియనిస్ట్ తెలిపారు.

స్వీట్ కార్న్ అనేది ఏడాది మొత్తం పాటు లభిస్తుంది. కానీ దేశీ బుట్టా అనేది కేవలం రెయినీ సీజన్ లో మాత్రమే లభిస్తుంది కావున ఈ రెయినీ సీజన్ లో దేశీ బుట్టా మొక్క జొన్న కంకులను తినేందుకు మొగ్గు చూపమని న్యూట్రీషియనిస్ట్ తెలిపారు.

స్వీట్ కార్న్ తో పోల్చుకుంటే, దేశీ బుట్టా జాతి కంకులతో శరీరానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది. అందువలన ఈ రెయినీ సీజన్ లో స్వీట్ కార్న్ కన్నా దేశీ బుట్టా కంకులను తీసుకోవడమే ఉత్తమం అని న్యూట్రీషియనిస్టులు తెలిపారు

స్వీట్ కార్న్ అనేది కేవలం రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే పోషక ఆహారంగా గుర్తింపు పొందింది. ఇందులో న్యూట్రిషన్‌ పరంగా ఎన్నో విలువైన అంశాలు ఉన్నాయి, ఇవి మన శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

శరీరానికి అవసరమైన పోషకాలు

స్వీట్ కార్న్‌లో మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యత, రక్త సంచారం, కండరాల పనితీరు వంటి అనేక ప్రాథమిక కార్యకలాపాలను సజావుగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

జీర్ణక్రియకు సహాయపడుతుంది

స్వీట్ కార్న్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం, గ్యాస్‌, ఆమ్లపిత్తం వంటి సమస్యలను ఇది తగ్గించడంలో సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది.

ఎముకలు, గుండె, కిడ్నీలకు మేలు

ఇందులో ఉన్న ఖనిజాలు ఎముకల బలాన్ని పెంచుతాయి. గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి అవసరమైన పోషకాల్ని అందిస్తాయి. కిడ్నీల పనితీరుపైనా మంచి ప్రభావం చూపుతాయి.

బరువు పెరగాలనుకునేవారికి ఉత్తమం

ఒక కప్పు స్వీట్ కార్న్‌లో సుమారు 342 క్యాలరీలు ఉంటాయి. అధిక శక్తి అవసరమవుతున్నవారు లేదా బరువు పెరగాలనుకునే వారు తమ డైట్‌లో దీనిని చేర్చుకోవచ్చు.

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది

స్వీట్ కార్న్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి, కోలన్ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

షుగర్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది

స్వీట్ కార్న్‌లో ఉండే ఫైటోకెమికల్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. పేషెంట్లు తగిన పరిమితిలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

రోజువారీ ఆహారంలో స్వీట్ కార్న్‌ను చేర్చుకుంటే రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి అనేక రకాల లాభాలు కూడా పొందవచ్చు. శక్తివంతమైన శరీరం, బలమైన ఇమ్యూనిటీ కోసం ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తప్పనిసరిగా డైట్‌లో చేర్చండి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version