కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తే మాత్రం ఊరుకునేది లేదు
మెట్ పల్లి జూలై 21 నేటి ధాత్రి
కాంగ్రెస్ పార్టీమల్లాపూర్ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి
పాత దాంరాజ్ పల్లి గ్రామం లో మాట్లాడుతూ నిన్న మీరు చేసిన షుగర్ ఫ్యాక్టరీ కొరకై పాదయాత్ర చేసినందుకు ఒక రైతుగా నేను అభినందిస్తా కానీ కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తే మాత్రం ఊరుకునేది లేదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం లోపలనే ఒక వంద డెబ్బై కోట్లు (170) పాత బకాయిలు చెల్లించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం మేము 2025 డిసెంబర్లో గా ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేపడతామని చెప్పాము మీ అరవింద్ కి కూడా తెలుసు పాత బకాయిలు కట్టకుండా ఏ పరిశ్రమకు కూడా ఏ బ్యాంకు గ్యారంటీ ఇవ్వదు మీ అరవింద్ కూడా 2019లో పాదయాత్ర చేశారు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ఐదు సంవత్సరాలలో నయా పైసా కూడా షుగర్ ఫ్యాక్టరీ పై ఖర్చు చేయలేదు పైగా ఫ్యాక్టరీ భూములు అమ్మాలని చూసింది అప్పుడు అడ్డుకున్నది మా కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి అనవసరమైన విషయాలు మాట్లాడకుండా మీ అరవింద్ ని అడగండి మా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఈ ఫ్యాక్టరీని ఎలా ప్రారంభించాలో ఎంతగా ఆలోచిస్తున్నారు మీ నాయకుడికి గుర్తు ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని నిందించకుండా మీకే గనుక చిత్తశుద్ధి ఉంటే షుగర్ ఫ్యాక్టరీ విషయమై మాతో కలిసి రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తు మీరు మా ప్రభుత్వం పైన వేస్తున్న నిరాధారమైన ఆరోపణలను నిందలను ఖండిస్తున్నాం
ఈ కార్యక్రమం లో రైతులు, నాయకులు మామిడాల శ్రీనివాస్, కొమ్ముల చిన్న చిన్నారెడ్డి,కలకోట శంకర్,కొత్తూరి చిన్న రాజారెడ్డి,పొలాస వివేక్ తదితరులు పాల్గొన్నారు.