ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ….

ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ

ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు. ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై శాసనమండలిలో (AP Legislative Council) గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు. ఈ చర్చలో భాగంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) మాట్లాడారు. ఐదు కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. క్రెడిబులిటీ కంపెనీలకే భూములు కేటాయింపు జరుగుతోందని తేల్చిచెప్పారు. ఎంవోయూలు కుదుర్చుకున్నాకే కంపెనీలకు భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

భూముల కేటాయింపుపై అసెంబ్లీలో చర్చిద్దాం: అచ్చెన్నాయుడు

ఏపీ శాసనమండలిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. భూముల కేటాయింపు అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని అన్నారు. సంబంధంలేని ప్రశ్నలకు జవాబులు ఎలా చెబుతాం? అని నిలదీశారు. రహేజా రియల్‌ఎస్టేట్‌ వ్యవస్థ కాదని అన్నారు. మంత్రి ఒప్పుకున్నారనడం సరికాదని చెప్పుకొచ్చారు. ఆధారాలు చూపించకుండానే మళ్లీ అవే ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొ్న్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version