దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని హద్నుర్ – రాంతీర్థ్ రోడ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్: మండల పరిధిలోని హద్నుర్ గ్రామం నుండి రాంతీర్థ్ వెళ్ళే రోడ్ కొన్ని దశాబ్దాలుగా మరమత్తులు లేఖ, కొత్త రోడ్ వేయాలేఖ నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద పెద్ద కాంక్రీట్ రాళ్లు వాహనాలకు తగిలి పంచర్ కావడం, ద్విచక్ర వాహనాలు మరియు పెద్ద వాహనాలు వెళ్లుటకు రోడ్ కి ఇరు వైపుల ఉన్న చెట్లు, ముళ్ళ పొదలు రోడ్ పైకి వాలి ఉండడం వల్ల ఎలాంటి వాహనాలు వెళ్ళాక పోవడంతో రాంతీర్థ, గుంజోట్టి, వడ్డి, మరియు శేంశలుపూర్ గ్రామాలకు వెళ్ళే గ్రామస్థులకు పలు ఇబ్బందులు కలుగుతున్నాయి.
దశాబ్దాలుగా పలు పార్టీల ప్రభుత్వాలు మారిన ఎలాంటి మార్పులు లేవు, పలు మార్లు ఎంపిడిఓ, కలెక్టర్ గార్లకు, అధికారులకు విన్నవించుకున్న లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పలు హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వంలో కూడా ఏమీ ఫలితం లేదని ఈ యొక్క నాలుగు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.