జాబితాపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ

జాబితాపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

●అంగరంగ వైభవంగా జెండా ఆవిష్కరణ…
●మాదిగల ఆకాంక్ష నెరవేర్చిన మందకృష్ణ మాదిగ కు రుణపడి ఉంటాం..

ఎమ్మార్పీఎస్ నేత నక్క సతీష్ మాదిగ.

 

నేటి ధాత్రి. జూలై 7

 

మాదిగల ఆకాంక్ష నెరవేర్చి మాదిగల జాతిపిత ఎస్సీ వర్గీకరణ సాధకుడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ దండోరా ఉద్యమం స్థాపించి 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మార్పీఎస్ నేత, (సీనియర్ నాయకులు ) నక్క సతీష్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి డప్పు చప్పుల్లు, డీజే పాటలతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మద్దతు తెలిపిన పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరి అమరుల త్యాగాలు గుర్తుచేస్తూ మౌనం పాటించి ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించరు.మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నక్క సతీష్ మాట్లాడుతూ

 

 

సామాజిక ఆర్ధిక రాజకీయ అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణం కోసం కాంక్షిస్తూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని అన్నారు. మాదిగ సమాజానికి దక్క వలిసిన రిజర్వేషన్ హక్కుల కోసం పోరాడుతూనే మరోవైపు నిరాదరణకు గురైన వర్గాలైన వికలాంగులు, వృద్ధులు, వితంతువుల, కోసం పోరాడి వారికి పెన్షన్ల పెంపుదలకై ఉద్యమం నిర్వహించారని గుర్తు చేశారు. గుండె జబ్బుల చిన్నారులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్లు, అయ్యేలా కృషి చేసిన ఘనత మందకృష్ణ మాదిగ దక్కుతుందన్నారు. ఎస్సీ. ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, తెలంగాణ అమరుల కుటుంబా లకు ఉద్యోగాలు, మహిళ భద్రత కోసం ఫాస్ట్ బ్రాక్ కోర్టులు, తెల్ల రేషన్ కార్డు ప్రజలకు ఆకలి కేకలు అనే కార్యక్రమం నిర్వహించి అప్పటి ప్రభుత్వంతో పోరాడి నాలుగు కిలోల నుండి 6, కిలోల బియ్యం పెంపుదలకై ఉద్యమం నిర్వహించారు. ఈ ఫలాలు కేవలం మాదిగల కోసం కాక సబ్బండ వర్గాల కోసం ఉద్యమం చేశారన్నారు.

 

 

ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని అన్నారు. మాదిగల కోసం గత 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటాలు ధర్నా లు, రాస్తారోకోలు చేసి వర్గీకరణ సాధించామని అన్నారు. రాజీలేని పోరాటం విజయవంతమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఎస్పీ, వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. ఈ విజయానికి కారణం ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు అందించిన సహకారమే నని అన్నారు. దేశంలో ఎన్నో కుల ఉద్యమాలు పుట్టిన ప్పటికీ లక్ష్యం సాధించే వరకు ఏ ఉద్యమం నిల బడలేక పోయాయని అన్నారు. మాత్రమే సజీవంగా నిలబడి లక్ష్యం చేరిందని దానికి సమాజం ఇచ్చిన సహకారమే ప్రధాన కారణమని అన్నారు. సమాజానికి కృతజ్ఞతగా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతామని అన్నారు. అనంతరం ఉద్యమానికి సహకరించిన వారికి వివిధ పార్టీ నాయకులకు శాలువతో చిరు సన్మానం చేశారు.

 

 

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, నీలం లక్ష్మీ నరసయ్య, మాజీ ఎంపీటీసీ చిత్తాని స్వప్న శ్రీనివాస్, అంబేద్కర్ సంఘ నాయకులు నలువల రాజయ్య, నీలం గంగారం, దీకొండ ప్రేమనాథ్,బిజెపి మండల ఉపాధ్యక్షులు శెట్టి రవి, మారిశెట్టి శ్రీకాంత్, అరిగెల శ్రీకాంత్, సంతోష్, బత్తిని లక్ష్మణ్, నీలం గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version