పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు…
సుభాష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు
ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ధర్మ రావు పేట ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాని ఈ విషయాన్ని ముందుగా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కి సమాచారం ఇచ్చి 24 గంటల తర్వాత పత్రిక ద్వారా తెలియపరస్తునని వారు తెలపడం జరిగింది. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు వారితో నేరుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈరోజు వారికీ సమాచారం ఇచ్చి పార్టీనుండి తప్పుకోవడం ఇరువురి మధ్యలో జరిగిన విషయమే పార్టీలో చేరిన రోజు ఇప్పుడు పార్టీ నుండి తప్పుకుంటున్న రోజు మధ్యవర్తి ఎవరు లేరు ఈ రాజీనామా నా ఇష్టాపూర్వకముగా చేస్తున్నది. ఆవేశంగా.తొందరపాటు నిర్ణయం కాకుండా ఒక ఆలోచన చేసి మంచి భావనతో
కొద్దీ రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని భవిష్యత్తు కార్యాచరణ కాలం నిర్ణయిస్తుందని ఆకుల సుభాష్ తెలిపారు
