ఘనంగా మేడే వేడుకలు
– హాజరైన డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగదన ముగింపు పలికేల చర్యలు చేపట్టి, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు తెలిపినా చలించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలను తీర్చడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బానయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.
