బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు………….
చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్
గుమ్మడి శ్రీదేవి…………వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ ……….
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
మండలంలోని బంగ్లపల్లి గ్రామంలో, వ్యవసాయమార్కెట్ కమిటీ చిట్యాల ఆధ్వర్యంలో. పశుసంవర్ధక శాఖ సౌజన్యంతో. ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ.

మొగుళ్లపల్లి మండలంలోని రైతుసోదరులు తమ పాడి పశువులు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాట్లు చేశామని రైతు సోదరులు తమ పశువులను పశు వైద్య అధికారికి చూపించి డాక్టర్ సలహాలు పాటించి పశువులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.ఆమెవెంట ఏ ఎం సి. వైస్ చైర్మన్ ఎండి రఫీ, డైరెక్టర్లు లింగయ్య, సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ కనుక .శేఖర్, మండల పశువైద్యాధికారి డాక్టర్.G. రాకేష్ శర్మ, ఎం .వెంకటేష్(జె వి వో), గోపాలమిత్ర శ్రీనివాస్, రాజన్న, అశోక్ , మార్కెట్ కమిటీ సిబ్బంది బొచ్చు రాజు, పడదల దేవేందర్ రావు, అల్లం సమ్మయ్య రైతు సోదరులు పాల్గొనడం జరిగింది.