అపోలో హాస్పిటల్ డాక్టర్లచే ఉచిత ఇ ఎ న్ న్టి చెవి పరీక్షలు
విజయవంతం
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో ఆదివారం నాడు శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ అపోలో డాక్టర్లచే దాదాపు 200 మంది పేషెంట్లకు చౌడు కు చెవుడుకు సంబంధించిన వారికి ఉచితంగా పరీక్షలు చేయించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేషంట్లకు అవసరం ఉన్నవారికి ఉచితంగా వినికిడి మిషన్లు పంపిణీ చేశామని అదేవిధంగా అన్నదానం రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి ఏర్పాటు చేశారని వారి పేర్కొన్నారు చిన్న పిల్లలకు రెండు సంవత్సరాల వరకు వినికిడి లోపం ఉంటుందని వారికి శ్రీ సత్య సాయి సేవ సంస్థ డాక్టర్లకే ఆపరేషన్లు ఉచితంగా ఏర్పాట్లు చేయించామని వారు పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి ఆదివారం ప్రతి గురువారం శ్రీ సత్యసాయి సేవా సంస్థ తరపున ఉచితంగా హోమియోపతి డాక్టర్ పేషెంట్లకు వైద్యం చేస్తున్నారని అదేవిధంగా ఉచిత హోమియోపతి మందులు సరఫరా చేస్తున్నారని వారు పేర్కొన్నారు హోమియోపతి డాక్టర్ కు శ్రీ సత్య సాయి సేవ సంస్థ తరఫున ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాదు రోడ్డులో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతిరోజు పేషెంట్లకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ తరఫున దాదాపు 300 మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు అన్నదానం ఏర్పాటు చేసేవారు శ్రీ సత్య సాయి సేవా సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డిని సత్యసాయి మందిరంలో సంప్రదించాలని మనోహర్ రెడ్డి వనపర్తి జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థ కన్వీనర్ నరహరి పుల్లయ్య శెట్టి ఒక ప్రకటనలో కోరారు