సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బిక్కజీపల్లి నూతన సర్పంచ్ బండారి రమేష్
నర్సంపేట,నేటిధాత్రి:
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని ఎనవాడకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చేసిన వాగ్దానం మేరకు సోమవారం దుగ్గొండి మండలంలోని బిక్కాజీపల్లి సర్పంచ్ గా బండారి రమేష్ భాద్యతలు స్వీకరించిన అనంతరం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్,ఉప సర్పంచ్ రమాదేవి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
