చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీ బస్టాండ్ సెంటర్లో చిట్యాల సాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నవాబుకి,అయన తోత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇళ్ళునే కార్యాలయంగా మార్చి భూమి కోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెలుగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని మనం జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి అని మాజీ ఎమ్మెల్యే గండ్ర అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్దు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు