లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి దర్శనాలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోవెలిసినటువంటి స్వయంభుశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుండి ముక్కోటి తొలి ఏకాదశి సందర్భంగా దేవాలయంలో ప్రజల సౌకర్యార్థం ఉత్తర ద్వారం నుంచి దర్శన భాగ్యం కలిగించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరం ద్వారంద్వారా స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయంలో ప్రజల సౌకర్యం కొరకు దర్శన భాగ్యం కల్పించే బాధ్యతను దేవాలయం సభ్యులు అందరూ కలిసి సకల సౌకర్యాలు కల్పించి దర్శనానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలుఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు సౌకర్యాలుకల్పించారని ఈ రోజుదర్శనం ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభం కావడం జరిగిందని అధిక సంఖ్యలో జిల్లా నలుమూలల నుండి ప్రజలు దర్శన భాగ్యం కల్పించుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు పొందినారనితెలియజేస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మహిళలు ప్రత్యేక పూజలు చేసి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగిందనీ స్వామివారి కృపతో ప్రజలందరూ పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోర లక్ష్మీరాజం. లక్ష్మ నరసింహస్వామి దేవాలయ అధ్యక్షులు. బండి చైతన్య. ప్రధాన కార్యదర్శి. రా పెళ్లి ఆనందం. ఉపాధ్యక్షులు. ఆలయ కమిటీ సభ్యులు నిర్మాణ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి దర్శనాలు చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
