పొలంలో జారి పడి వ్యవసాయ కూలీ దుర్మరణం
పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన సామాజిక కార్యకర్త నల్లమారి రమేష్
రైతు కూలీలకు సైతం భీమా సౌకర్యం కల్పించాలి
మృతుని కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి.
నేటి ధాత్రి అయినవోలు
అయినవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన సింగారపు రాములు (50) అనే రైతు కూలి అదే గ్రామానికి చెందిన ఓ రైతు దగ్గర వ్యవసాయపనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒడ్డు పైనుంచి కాలుజారి బురదలో పడి మరణించినాడు. మృతునికి భార్య నలుగురు ఆడపిల్లలు. నిరుపేద కుటుంబానికి చెందిన రాములు తను ఇన్నాళ్లు కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించాడు. అయితే ప్రమాదంలో రాములుమృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు నిరాశ్రయులుగా మిగిలిపోయినారు. అయితే ఆ కుటుంబం యొక్క దీనస్థితిని తెలుసుకున్న సామాజిక కార్యకర్త నల్లమారి రమేష్ సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సాయంగా 5000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని విధాల ఈ కుటుంబాన్ని ఆదుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి భర్త మరణంతో వితంతువుగా మారిన దేవేంద్రకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థాన డైరెక్టర్ సింగారపు రాజు గ్రామ పెద్దలు బంధువులు ఉన్నారు.