టీనేజ్ లో గర్భధారణ ఎలోప్మెంట్ పై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలి

టీనేజ్ లో గర్భధారణ ఎలోప్మెంట్ పై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలి

* టీనేజ్ గర్భధారణ ఎలోప్మెంట్ పై అవగాహనా కార్యక్రమం
* యువత సోషల్ మీడియా వాడకం తగ్గించాలి
• మునిసిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకటరెడ్డి

నేటిధాత్రి,చేవెళ్ళ :

చేవెళ్ళ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని చేవెళ్ల 1,2,3,4, ఊరెళ్ళ 1,2, కేసారం, మల్లారెడ్డి గూడ, కందవాడ-1,2,3, మల్కాపూర్-1,2, దామరగిద్ద, రామన్నగూడ, ఇబ్రహీంపల్లి,మొండివాగు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు జరిగాయి . ఈ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ళ మునిసిపల్ కార్యాలయం వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ టీనేజ్ లో గర్భధారణ, ఎలోప్మెంట్ పై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలన్నారు.

అమ్మాయిలు ఎవరో ఏదో చెప్పారని అబ్బాయిల వలలో పడి బంగారు జీవితాన్ని ఆగం చేసుకోవద్దని కోరారు. ముఖ్యంగా పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, సోషల్ మీడియా ఫోన్ ల వాడకం తగ్గించాలని, అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎస్ .వెంకటేశం ,కౌన్సిలర్లు శైలజ ఆగిరెడ్డి, మద్దెల శ్రీను, ఎస్ఐ శిరీష , ఐ సి డి ఎస్ సూపర్వైజర్ రేవతి , సంబంధిత వార్డు కౌన్సిలర్లు , అంగన్వాడీ సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఉమారని, ప్రవీణ, ఆశా వర్కర్లు, మునిసిపల్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version