సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ వాహనాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వాహనాల పార్కింగ్ మరియు సంరక్షణ కోసం నిర్మించిన నూతన షెడ్‌ను ఎస్పీ మహేష్ బి గితే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన
జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు కేటాయించిన పెట్రోకార్ మరియు బ్లూ కోల్ట్ వాహనాలను తనిఖీ చేసి నిర్వహణపై సూచనలు ఇచ్చారు. నేర సమాచారం అందిన వెంటనే ఈ వాహనాల ద్వారా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు.
వాహనాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, డ్రైవర్లు వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్‌లో ఉంచాలని సూచించారు. అనంతరం అధికారులు కలిసి షెడ్ పరిసరాల్లో మొక్కలు నాటారు.
