పార్టీలు, కండువాలు వేరైనా బీజేపీ,కాంగ్రెస్ విధానం ఒక్కటే
మందమర్రి నేటి ధాత్రి
కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్ లను తెచ్చిన బీజేపీ,మోడీ ప్రభుత్వంపై కార్మిక వర్గం,ప్రజలు జూలై 9 దేశా వ్యాప్త సమ్మె చేపట్టగా.
బీజేపీ,మోడీ కంటే మా ప్రభుత్వం ఎం తాక్కువకాదు అన్నట్లుగా
కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటల విధానాన్ని తేవడం దుర్మార్గం సిగ్గు చేటు.
కార్మిక వర్గం పై జరుగుతున్న నిరంకుశత్వ దాడిపై జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు కార్మిక వర్గం బుద్ది చెప్పాలి
డా. బి ఆర్ అంబేడ్కర్ విగ్రహనికి పూల మాలలు.
మందమర్రి సీఐటీయూ అధ్వర్యంలో కార్మికుల బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడిన సంకె రవి సీపీఎం జిల్లా కార్యదర్శి.
పాల్గొన్న దూలం శ్రీనివాస్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి.కార్మికులు.
కేంద్రంలోని బిజెపి,మోడీ రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు పార్టీలు, కండువాలు మాత్రమే వేరు పరిపాలన విధానం బడా పెట్టుబడుదారులు కార్పొరేట్ లా ఖజానా నింపడానికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేయడమే వారి లక్ష్యం ఈ నిరంకుషత్వ విధానాలకు వ్యతిరేకంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మందమర్రి బి ఆర్. అంబేడ్కర్ విగ్రహం నుండి కార్మిక వాదాలు,మార్కెటింగ్ గుండా బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం మొదటి నుండే రైతు, కార్మిక,వివిధ తరగతుల ప్రజలపై ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉంది.
గతంలో రైతులపై మూడు నల్ల చట్టాలతో దాడి చేస్తే, వాటిని తిప్పి కొట్టడానికి రైతాంగమంతా పెద్ద ఎత్తున పోరాటాని నడిపించి మూడు చట్టాలను తిప్పికొట్టారు. అలాగే ఈరోజు కార్మిక వర్గంపై కూడా లేబర్ కోడ్ ల పేరుతో కార్మికులకు ఉన్న 49 చట్టాల నుంచి 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చి బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు వారి ఖజానా నింపుకోవడానికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా బలి చేస్తున్నారు.
ఈ లేబర్ కోడ్ లను తిప్పి కొట్టడానికి కార్మిక వర్గానికి అండగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న స్వతంత్ర ఫెడరేషన్లు,రైతు సంఘాలు,రైతు కూలీల సంఘాలు, అసోసియేషన్లు, విద్యార్థి సంఘాలు, విద్యుత్తు రంగ కార్మికులు ఇలా అన్ని రంగాల ప్రజలు ఈ పోరాటానికి మద్దతుగా నిలబడుతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బిజెపి మోడీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ జీవో నెంబర్ 282 పేరుతో 12 గంటల విధానాన్ని అమలు చేయమని సర్క్యులేరు జారీ చేయడం కార్మిక వర్గాన్నే కాక నమ్మి ఓటేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయడమే అవుతుంది.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక ఈ లేబర్ కోడ్ లను రద్దు చేయకుంటే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెలకు కూడా రైతంగ పోరాట స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఎస్సి కేస్ సిఐటియు మందమర్రి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు గందం రవి, రమేష్ నాయకులు తిరుపతి, సంగి పోషం, వి. నిర్మల, రాజేంద్ర ప్రసాద్, రవీందర్, శ్రీధర్, రాయమల్లు, కొమ్మురయ్య, తిరుపతి, నరేష్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.