“దేశాల్లో ఎనర్జీ లాక్‌డౌన్”..? భారత్ పరిస్థితి ఏంటి?

“దేశాల్లో ఎనర్జీ లాక్‌డౌన్”..?
భారత్ పరిస్థితి ఏంటి?

కరోనా తర్వాత… ఇప్పుడు “ఎనర్జీ లాక్‌డౌన్” భయం..? పెట్రోల్ ఆదా కోసం ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు… భారత్‌కు కూడా హెచ్చరికలా మారుతున్నాయా..?

కరోనా సమయంలో వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది..! ఇప్పుడు అదే తరహాలో… కానీ ఈసారి కారణం వైరస్ కాదు… “ఇంధన సంక్షోభం”..!
ముడి చమురు ధరలు పెరగడం… సరఫరా అనిశ్చితి పెరగడంతో అనేక దేశాలు ప్రజల కదలికలను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. నెట్టింట దీనినే “ఎనర్జీ లాక్‌డౌన్”గా పిలుస్తున్నారు.
మొదట పాకిస్థాన్..! ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి కేవలం 4 రోజులే పని..! మిగిలిన రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్..!
బంగ్లాదేశ్ ఇంకో అడుగు ముందుకేసి పాఠశాలలకే తాళం వేసింది..! ఆఫీసుల పనివేళలు కూడా తగ్గించింది..!
ఈజిప్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఒకరోజు ఇంటి నుంచే పని తప్పనిసరి చేసింది..!
థాయిలాండ్, మలేషియా దేశాలు అనవసర ప్రయాణాలు తగ్గించాలని, వర్చువల్ మీటింగ్స్ నిర్వహించాలని కంపెనీలకు సూచిస్తున్నాయి.
ఇవన్నీ కలిపి చూస్తే… ప్రపంచ దేశాలు “చమురు అత్యవసర పరిస్థితి” కోసం మానసికంగా సిద్ధమవుతున్నాయనే భావన కలుగుతోంది.

ఇక భారత్‌లో పరిస్థితి ఏంటి..?
దేశ చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్‌కు అంతర్జాతీయ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలన్నారు..! ఐటీ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు మళ్లీ కరోనా కాలం నాటి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు..! విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు కూడా కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు.
మోదీ పిలుపుతో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే స్పందించడం మొదలుపెట్టాయి..! ఏపీలో కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించింది.
ఢిల్లీలో సీఎం Rekha Gupta వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.
అయితే… భారత్‌లో ఇప్పటివరకు అధికారిక “ఎనర్జీ లాక్‌డౌన్” లేదు..! కానీ పరిస్థితులు మరింత క్లిష్టమైతే… పెట్రోల్ విక్రయాలపై పరిమితులు… సొంత వాహనాల వినియోగంపై నియంత్రణలు… భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version