చివరి నిమిషంలో గేమ్ మారిందా..

చివరి నిమిషంలో గేమ్ మారిందా..?
రాహుల్ ఫైనల్ కాల్ ఇదేనా..?

 

కేరళ సీఎం కుర్చీ కోసం ఢిల్లీ స్థాయిలో జరిగిన హై వోల్టేజ్ రాజకీయానికి ఎట్టకేలకు ఎండ్లో కార్డు పడింది..! అన్ని లెక్కలు, అన్ని ఒత్తిళ్లు, అన్ని లాబీయింగ్‌లను దాటుకుని కేరళ కొత్త ముఖ్యమంత్రిగా V. D. Satheesan పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది..! పదిరోజులుగా పార్టీ లోపల సాగిన మౌన యుద్ధంలో చివరికి గెలిచింది గ్రౌండ్ పాలిటిక్స్‌నా..? లేక రాహుల్ గాంధీ నమ్మకమా..? ఇప్పుడు అదే కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది..!

ఒకవైపు ఢిల్లీలో బలమైన పట్టు ఉన్న K. C. Venugopal… మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పోరాడిన సతీశన్..! ఈ ఇద్దరి మధ్య సీఎం రేస్ చివరి నిమిషం వరకూ టఫ్ ఫైట్‌గా మారింది. కానీ రాష్ట్ర నేతల నుంచి వస్తున్న వ్యతిరేక సంకేతాలు, లోపలి అసంతృప్తి, తిరుగుబాటు హెచ్చరికలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆలోచింపజేశాయి. కేసీకి సీఎం పదవి ఇస్తే పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందన్న రిపోర్టులు ఢిల్లీని అలర్ట్ చేశాయి. దీంతో చివరి క్షణంలో గేమ్ మొత్తం సతీశన్ వైపు టర్న్ అయింది..!

ఇక్కడే మరో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ కనిపిస్తోంది..! కేరళలో పార్టీని కాపాడాలంటే ఢిల్లీ నాయకత్వం కాదు… గ్రౌండ్‌లో ఫైటింగ్ చేసే నాయకుడే కావాలని Rahul Gandhi భావించినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వంపై సతీశన్ చేసిన దూకుడు పోరాటాలు, ప్రజల్లో పెరిగిన కనెక్ట్, పార్టీ క్యాడర్‌లో ఉన్న అంగీకారం ఆయనకు ప్లస్ అయ్యాయి. “పార్టీని గెలిపించేది ఎవరు..?” అన్న ఒక్క ప్రశ్నే చివరికి సీఎం కుర్చీని నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి..!

సతీశన్ ఎంపికతో కేరళ కాంగ్రెస్‌లో కొత్త తరం నాయకత్వానికి డోర్ ఓపెన్ అయినట్టైంది..! ఇక కేసీ వేణుగోపాల్‌ను జాతీయ రాజకీయాలకే పరిమితం చేస్తూ, రాష్ట్ర బాధ్యతలను స్థానిక నాయకత్వానికి అప్పగించడం ద్వారా కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్‌కు దిగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నాళ్లుగానో కేరళ కాంగ్రెస్‌ను వెంటాడుతున్న వర్గపోరుకు ఈ నిర్ణయం తాత్కాలిక బ్రేక్ వేస్తుందా..? లేక ఇది మరో కొత్త పవర్ సెంటర్‌కు శ్రీకారం చుడుతుందా..? ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ఇదే బిగ్ డిబేట్..!

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version