ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం

నీట్ 2026 పేపర్ లీకేజీ – మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యం

22 లక్షలకుపైగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి

ఈసీఐఎల్ నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆశలను నీట్ -2026 పరీక్ష మరోసారి అవినీతి, నిర్లక్ష్యం, కోచింగ్ మాఫియా – అధికార యంత్రాంగం కుమ్మక్కు కారణంగా విద్యార్థుల శాపంగా మారిందని,నీట్ పరీక్షను నిర్ధిష్టంగా నిర్వహించలేకపోయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని అంబేద్కర్ కూడలి వద్ద ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్. మాట్లాడుతూ
మే 3న నిర్వహించిన నీట్ 2026 పరీక్షలో పేపర్ లీకేజీ, భారీ అక్రమాలు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు . దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఇది కేవలం ఒక పరీక్ష వైఫల్యం కాదని, మోడీ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. పారదర్శకత డిజిటల్ ఇండియ అమృత కాలం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, విద్యార్థులకు కనీస భద్రతతో పరీక్ష కూడా నిర్వహించలేకపోయిందని విమర్శించారు . 2024లో జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ, అప్పట్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేదన్నారు . అదే నిర్లక్ష్యం ఇప్పుడు మరింత పెద్ద స్కాండల్‌గా మారిందని, ఇది యాదృచ్ఛికం కాదని, పరీక్షా వ్యవస్థను కోచింగ్ మాఫియా, అవినీతి వలయం, కార్పొరేట్ ప్రయోజనాలకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితమన్నారు . ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపడుతున్నాయని . కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్ టి ఏ ) ను ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేసారు.
పరీక్ష రద్దుతో లక్షలాది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, పేద, మధ్యతరగతి కుటుంబాలు కోచింగ్, హాస్టల్, ప్రయాణ ఖర్చులతో ఆర్థికంగా కుదేలయ్యారని, విద్యార్థుల ఒక సంవత్సరం భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు . నిజాయితీగా చదివిన విద్యార్థుల నమ్మకాన్ని వ్యవస్థ ఛిద్రము చేసిందన్నారు . కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ఎన్ టి ఏ ను పూర్తిగా ప్రక్షాళన చేసి, అవినీతికి పాల్పడిన అధికారులను అరెస్ట్ చేయాలని, నీట్ -2026 పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరపాలని, కోచింగ్ మాఫియా – అధికారుల – రాజకీయ సంబంధాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని, విద్యార్థులకు ఎటువంటి అదనపు ఫీజులు లేకుండా, పూర్తి భద్రతతో మళ్లీ పరీక్ష నిర్వహించాలని, విద్యార్థుల మానసిక, ఆర్థిక నష్టానికి కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని, జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణను పూర్తిగా పారదర్శకంగా మార్చాలని, దేశ యువత భవిష్యత్తుతో ఆటలాడే ప్రభుత్వాలను చరిత్ర క్షమించదన్నారు . విద్యను వ్యాపారంగా మార్చి, పరీక్షలను అవినీతి కేంద్రాలుగా మార్చిన మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి-యువజన ఉద్యమాలను దేశవ్యాప్తంగా మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు .
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్, వికాస్, మురళి, నేతలు రవళి, కిరణ్మయి, దీప్తి, కుమార్, నదీమ్, మురళీకృష్ణ, పరమేష్, ప్రదీప్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version