రామలింగేశ్వర శివాలయ అభివృద్ధి విరాళాలు అంద జేత
అభివృద్ధికి సహకారం చేస్తున్న ప్రజలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం ప్రగతి సింగారo గ్రామంలో అతి పురాతన రామలింగేశ్వర శివాలయ అభివృద్ధికి విరాళాలు అందజేస్తున్నారు పూర్వీకుల కల సహకారం చేసేందుకు కంకణం కట్టిన ప్రజలు, నాయకులు పూర్వ వైభవానికి కృషి చేస్తున్న ప్రజల సహాయ సహకారాలు వల్ల దేవునికి పూర్వ వైభవానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నా రు.
అంతేకాకుండా విరాళాలు ఇచ్చే వారి కుటుం బ సభ్యులకు ఎల్లవేళలా రామలింగేశ్వర దేవాలయ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నారు ఈ కార్యక్రమంలో ప్రగతి సింగారం, ప్రజలు , నాయకులు, పాల్గొన్నారు.
