పరకాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశం

పరకాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశం

పరకాల,నేటిధాత్రి

పరకాల పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఛాహాత్ బాజ్‌పాయ్ హాజరై అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు.మహిళల ఆర్థిక సాధికారత,రైతుల సంక్షేమం,విద్య మరియు వైద్య రంగాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ ఛైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్,వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి,గూడెప్పాడు మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి,పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ,జడ్పీ సీఈవో శేషాద్రి,డీఆర్‌డీవో మేన శ్రీను,ఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్ రావు,పరకాల ఏసీపీ సతీష్ బాబు,డీపీవో లక్ష్మీ రమాకాంత్,డీడబ్ల్యుఓ విశ్వజ,గృహ నిర్మాణ శాఖ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.అదనంగా తహసీల్దార్లు,ఎంపీడీవోలు,సర్పంచులు,కౌన్సిలర్లు,వార్డు సభ్యులు,మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version