వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి వాటర్ బాటిల్స్ పంపిణీ
ఎండాకాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య సంరక్షణపై అధికారుల సూచనలు
వరంగల్, నేటిధాత్రి.
ఎండాకాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది ఆరోగ్యం మరియు సురక్షిత సేవల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే. సుజాత ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఏసీపీ టీ. సత్యనారాయణ చేతుల మీదుగా ట్రాఫిక్ సిబ్బందికి వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.
విధులు నిర్వహించే సిబ్బంది ఎండాకాలంలో తగినంత నీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
