కాలేశ్వరం కు భారీగా తరలివచ్చిన భక్తులు
భూపాలపల్లి నేటిధాత్రి
సరస్వతి అంత్య పుష్కరాల ఐదో రోజు సందర్భంగా కాళేశ్వరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పుణ్యనదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతున్నప్పటికీ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
భక్తులకు తాగునీరు, శానిటేషన్, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అలాగే భక్తులు సహకరించి, అధికారులు సూచనలు పాటిస్తూ పుష్కర స్నానాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏదేని అస్వస్థతకు గురైతే వెంటనే 108, అత్యవసర వైద్య సేవల కేంద్రాల్లో వైద్య సేవలు తీసుకోవాలని తెలిపారు.a
