అమనగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యo.
అమనగల్ /నేటిదాత్రి :
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్. పత్య నాయక్ మంగళవారం అమనగల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు జగన్ మున్సిపల్ అధ్యక్షులు మానయ్య నాయకులతో కలిసి ఆమనగల్ మున్సిపాలిటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చైర్మన్ పత్య నాయక్ తెలియపరిచారు.టీయూ.ఎఫ్. ఐ. డి. సి.నిధుల 25 కోట్ల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లు పార్కులు ఓపెన్ జిమ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది…ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గుర్రం కేశవులు,శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ డైరెక్ట్,కండే రంగయ్య వసుప్పుల శ్రీశైలం ,కాలే మల్లయ్య, కృష్ణ నాయక్, శివలింగం, ఒగ్గు మహేష్, రాగ్య నాయక్,మలేష్ నాయక్, కృష్ణ యాదవ్, ఎండి ఫరీద్, ,అలిమ్ ,వసుప్పుల శ్రీకాంత్,గుండ్రాతి కుమార్ గౌడ్, మహేష్,శ్రీనునాయక్, గుద్దేటి శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
