జహీరాబాద్: పంచముఖి ఆంజనేయ స్వామికి పండ్లతో అలంకరణ.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీలో పంచముఖి ఆంజనేయ స్వాముల వారి దేవాలయంలో శ్రావణసందర్భంగా పంచముఖి ఆంజనేయ స్వాముల వారికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించి, స్వాములవారికి ఎంతో ఇష్టమైన, పండ్లతో అలంకరించి స్వామి వారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక హారతి నిర్వహించారు. భక్తులు, కాలనీవాసులు, పరిసర ప్రాంతాల నుండి భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.