ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ అధ్యక్షతన జరిగిన డ్రగ్స్ నివారణ -చర్యల గూర్చి స్టూడెంట్ కౌన్సిలర్ శ్రీధర్ మరియు సామల వివేకానంద మాట్లాడుతూ విద్యార్థులు మాదగద్రవ్యాలకు, మత్తు పానీయాలకు ,సెల్ ఫోన్ లకు దూరంగా ఉండి మీ జీవితాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లాలని హితువు కోరారు. మాదగద్రవ్యాలను సేవించడం వల్ల వారి శరీరంలో అనేక రోగాలు కలుగుతాయని , అంతేగాకుండా మానసిక రుక్మతులకు గురి అవుతారని వారు తెలిపారు. ముఖ్యంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల విద్యార్థులు చదువుల యందు దృష్టి సాధించలేరని ఏకాగ్రత ఉండదని కాబట్టి వాటికి దూరంగా ఉండి మీ జీవితాన్ని మంచి మార్గాల వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతూ కానిస్టేబుల్ విజయ్ మరియు రాజు మాట్లాడుతూ సెల్ ఫోన్ల ద్వారా అనేకమైన సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మొదలైన యాప్స్ (apps)ద్వారా తమ యొక్క బ్యాంకులో నీ డబ్బులను నష్టబోతున్నారని వారు తెలియజేశారు.
వాటిపై అవగాహన కలిగి ఉండేలా ఎవరికి తమ నెంబర్లను మన అకౌంట్లను ఇవ్వవద్దని వారు తెలిపారు. ఏమైనా సైబర్ క్రైమ్ జరుగుతే వెంటనే 1930 నెంబర్ కు డయల్ చేసి మీరు ఏ విధంగా క్రైమ్ లో నష్టపోయారో వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంటీ డ్రగ్ పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ మరియు స్టూడెంట్ కౌన్సిలర్ శ్రీధర్, సామల వివేకానంద మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.