కార్పొరేటికరణ, ఆపరేషన్ కగార్ హత్య కాండను ఆపాలి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో గుండాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణ ముందు కొమరం భీమ్,అంబేద్కర్ విగ్రహాల వద్ద గోడ పత్రికల ఆవిష్కరణ చేశారు. ఆదివాసి ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్, తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ మెంతెన సంజీవరావు లు పాల్గొని మాట్లాడారు.
ఆదివాసీ హక్కులు, కార్పొరేటీకరణ, ఆపరేషన్ కగార్ హత్యాకాండ, కాల్పుల విరమణ ,పెసా తదితర ఆదివాసి చట్టాలు పరిరక్షించబడాలని, మావోయిస్టులు ,నక్సలైట్ల పేరుతో ఆదివాసి జాతి హననానికి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ పాశవిక నిర్బంధానికి వ్యతిరేకంగా ఈనెల 24న వరంగల్ లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు ఆదివాసీ, ఇతర పీడిత ప్రజలు తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , ఆదివాసి హక్కుల కార్యకర్త సోనీ సోరీ, మానవ హక్కుల కార్యకర్త,సామాజిక న్యాయవాది బేలబాటియా ,పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ నుండి జేవి చలపతిరావు, మాస్ లైన్ నుండి పోటు రంగారావు, జాన్ వెస్లీ (సిపిఎం) రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే, (సిపిఐ )రాష్ట్ర కార్యదర్శి, ప్రొఫెసర్ హరగోపాల్ తదితర రాష్ట్ర ,జాతీయ స్థాయి నాయకత్వం పాల్గొని ప్రసంగించనున్నారని నాయకులు తెలిపారు. ఈ బహిరంగ సభ ప్రధానంగా మధ్య భారతంలోగల దండకారణ్య ప్రాంతంలోని ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఎన్కౌంటర్ల పేరుతో అణిచివేస్తున్న ఆదివాసీల ఉద్యమకారుల జీవించే హక్కును రక్షించుకోవాలని, బస్టర్ లో ఏర్పాటు చేసిన వందలాది సాయుధ బలగాల క్యాంపులను వెంటనే ఎత్తివేసి కేంద్ర ప్రభుత్వం విప్లవకారులతో శాంతి చర్చలను కొనసాగించాలని, తక్షణం కాల్పుల విరమణను ప్రకటించాలని, భారత రాజ్యాంగం ఆదివాసి లకు కల్పించబడిన హక్కులన్నింటినీ అమలు చేయాలని, 1996 పెసా చట్టం 2006 అటవీ హక్కుల చట్టం ఫిఫ్త్ షెడ్యూల్ లను రక్షించుకోవడానికి పోరాటం ద్వారానే సాధ్యపడుతుందని వక్తలు స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ , కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల ప్రధాన బాధ్యులు పాల్గొన్నారు.తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రామటెంకి అశోక్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అరెం నరేష్, మండల కార్యదర్శి , లాలు సారయ్య, వట్టం కన్నయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు తుడుం దెబ్బ, చింతా వెంకటేశ్వర్లు తుడుందెబ్బ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి, రమణ బాబు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షుడు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కోరం శాంతయ్య మండల కార్యదర్శి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఈసం పాపారావు, న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం నుండి గుగులోతు రామచందర్, తెలంగాణ జనసమితి మండల అధ్యక్షుడు గొల్లపల్లి రమేష్, కొడెం వెంకటేశ్వర్లు తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి, పూణెం శ్రీను రాష్ట్ర ప్రచార కార్యదర్శి, చింత వెంకటేశ్వర్లు, ఏఐటిఎఫ్ నుండి ఈసం కృష్ణ, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శి పరిషిక రవి, ఏ ఎస్ పి నుండి పూణెం రమణబాబు, పి వై ఎల్ డివిజన్ కార్యదర్శి సుగుణ రావు, కాంగ్రెస్ బసవయ్య, ముత్తయ్య ,రమేష్ మేక సారయ్య, గొగ్గిల సాంబశివరావు, అరెం రామారావు, తదితరులు పాల్గొన్నారు.