గోదాం లవద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి.

గోదాం లవద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి

బురదమయం అవ్వడంతో బస్తాలు దింపడంలో ఇబ్బదులను ఎదుర్కొంటున్నాం

ఏఐటియూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్

పరకాల నేటిధాత్రి

 

 

 

 

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లోగల గోదాంల వద్ద సీసీ రోడ్లను వేయించాలని ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్ అన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ 2014-15వ సంవత్సరంలో పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో 5000 మెట్రిక్ టన్నుల గోదాంను నాబార్డ్ వారి సహకారంతో 3,00,00 లక్షలతో నిర్మించడం జరిగిందని గోదాంలో సరైన సౌకర్యాలు లేక కొన్ని సంవత్సరములు ఖాళీగా ఉన్న గోదాంను కార్మికులామంతా కలిసి సివిల్ సప్లై డిఎం,ఆర్ఎం లకు కలిసి గోదాంలు కాలిగా ఉంటున్నాయని వాటిలో పీడీఎస్ బియ్యాన్ని దింపినటైతే మాకు కూలి దొరుకుతుందని మా పరిస్థితిని వెళ్ళబుచ్చగా 2025లో జనవరి మాసంలో వాళ్లతో అగ్రిమెంట్ ఒప్పందం చేసుకొని 5,000 మెట్రిక్ టన్నుల గోదాంలో బియ్యం దింపడం జరిగింది.

కార్మికుల కష్టాలు తీరుతున్నాయానుకునే సమయంలో వర్షాకాలం సమీపిస్తున్న వేల అసలైన సమస్య ఎదురైందని గోదాం చుట్టూ సీసీ రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నామన్నారు.

గతంలో వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని గోదాం చుట్టూ లోతట్టు ప్రాంతం అవ్వడంతో నీరు నిల్వవుండి బురద మయంగా మారిందని పిడిఎస్ బియ్యంతో వచ్చే లారీలు దిగబడుతున్నాయని, బస్తాలు మోయాలంటే కష్టంగా ఉన్నదని,బియ్యం బస్తాలు దూరం మోయవలసి వస్తుందని దానివల్ల మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నామన్నారు.

 

CC roads

 

 

గోదాం చుట్టూ సీసీ ఏర్పాటు చేసి మా కార్మికుల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని అధికారులను కార్మిక సంఘం తరుపున కోరుతున్నామని తెలిపారు.

కార్మిక నాయకులు ప్రధాన కార్యదర్శి నాగేళ్లి శంకర్,కోగిల శంకరయ్య,రేణిగుంట్ల రాజయ్య,కోడపాక ఐలయ్య,కోట యాదగిరి,బొట్ల భద్రయ్య,కోడపాక చిరంజీవి,శ్రీపతి రాజయ్య, శ్రీపతి కుమార్,కోగిల కైలాసం,జన్ను పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version