అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ విజయం అవసరం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరా వు
శాయంపేట నేటిధాత్రి:
గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ లుగా గెలిపించుకోవాలనిభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు. ఉదయం మండలంలోని నేరేడుపల్లి, అప్పయ్యపల్లి, ప్రగతిసింగారం, కాట్రపల్లి, సాధనపల్లి, సూర్యనాయక్ తండా, గంగిరేణిగూడెం, వసం తాపూర్ గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి ముఖ్య నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు.
