హన్మంత్ రావు పాటిల్ గారిని ను మర్యాద పూర్వకంగా కలిసి
◆:…సన్మానించిన కాంగ్రెస్ నాయకులు రాయికోటి నర్సిములు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ హన్మంత్ రావు పాటిల్, యువ నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్ గార్లను కలసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయికోటి నర్సిములు… ఝరాసంగం లోని హన్మంత్ రావు పాటిల్ గెస్ట్ హౌజ్ లో మర్యాద పూర్వకంగా కలసి సన్మానం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కలిసిన సందర్బంగా ఈ సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా హన్మంత్ రావు పాటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే పలు అభివృద్ధి పనులు సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, కొల్లూర్ సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్ కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, డప్పుర్ సంగమేష్, శ్రీకాంత్ రెడ్డి, జాన్ శ్రీకాంత్,అంబేద్కర్, డప్పూర్ హరి తదితరులు ఉన్నారు..
