భారత్ రిపోర్టర్ పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ ప్రవీణ్య,
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం భారత్ రిపోర్టర్ దిన పత్రిక క్యాలండర్ ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వీయనియంత్రణ ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవడానికి పత్రికలు ప్రయత్నించాలన్నారు.సామాజిక సమరసత, సామాన్యుల గొంతుగా నిలవడం, అక్షరాస్యతను పెంచడం,లింగ వివక్షను రూపుమాపడం,శాంతి, సామరస్యం,జాతీయ భద్రత వంటి అంశాల్లో రాజీ పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఇంచార్జ్ భారత్ రిపోర్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బి. నగేష్, డాక్టర్. ఆంజనేయులు, టి. కుమార్, ప్రభాకర్, యాదగిరి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
