ప్రెస్ నోట్
కుంగ్ ఫు పోటీలలో చిచ్చర
పిడుగుల ప్రతిభ
మందమర్రి నేటి ధాత్రి
—ముఖ్య అతిథిగా ఎస్ ఐ రాజశేఖర్.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం సెప్టెంబర్ ఈ నెల 7న కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్ లో మూడవ రాష్ట్ర స్థాయి కుంగ్ ఫూ అండ్ కరాటే పోటీలకు మందమర్రి పట్టణానికి చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు మస్టర్ జెట్టి కృష్ణ తెలిపారు. కుంగ్ ఫూ నుంచి ప్రథమ స్థానంలో అద్విక్, ద్వితీయ స్థానంలో పెండ్యాల శ్రీకృతి, శాన్విత్, తృతీయ స్థానంలో విష్ణు వర్ధన్, యశ్వంత్ వర్మ, ఈసందర్భంగా సెప్టెంబర్ 8 నాడు మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో ఎస్ ఐ రాజశేఖర్, ముఖ్యఅతిథిగా విచ్చేసి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి పలువురిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.