చెర్రీ డాన్స్ స్టూడియో ప్రారంభం
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో బొజ్జ హేమంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెర్రీ డాన్స్ స్టూడియోను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,వేసవికాలంలో పిల్లలకు చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలో డాన్స్ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.పిల్లలు విద్యతో పాటు సాంస్కృతిక,క్రీడా రంగాల్లో కూడా ప్రతిభ కనబరచాలని ఆయన సూచించారు.డాన్స్ ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,మండల కార్యదర్శి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
