*చందుర్తి నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక..*
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల లింగయ్య ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే హెచ్ – 143 జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా సమక్షంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా లింగాల తిరుమల్, ఉపాధ్యక్షులు రాజూరి విష్ణు, ప్రధాన కార్యదర్శి మ్యాకల కొమురయ్య, కోశాధికారి మేడిశెట్టి మధు, కార్యదర్శి వంకాయల కార్తీక్, కొడగంటి గంగాధర్, గౌరవ అధ్యక్షులుగా లింగాల లింగయ్య, ఏనుగుల కృష్ణ, గౌరవ సలహాదారులు గొట్టే మనోహర్, కార్యవర్గ సభ్యులు రాజూరి సద్గుణ చారి, రాజురి రఘురాం, బొట్లవార్ శ్రీనివాస్, నక్క యాకూబ్, మర్రి నిశాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ ముందుగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, టియుడబ్ల్యూజేహెచ్ – 143 సంఘం జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఇటీవల జర్నలిస్టుల అక్రిడేషన్ విషయంలో ముందుండి కొట్లాడిన ఘనత మనదని అన్నారు. నేడు చందుర్తి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం సంతోషకరమని రాబోవు రోజుల్లో జర్నలిస్టుల హక్కుల కొరకు, వారి సంక్షేమం కోసం సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అలీ, విజయ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
