పేద వ్యక్తి అంతక్రియలకు ఆర్థిక సహాయం

మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా),22 అక్టోబర్ (నేటిధాత్రి):

సమాజంలో గొప్ప వాళ్ళు ఇంకా గొప్పగా, పేదవారు ఇంకా పేదలు అవుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని పటేల్ నగర్ లో నివసిస్తున్న ప్రమోద్(21) పవన్ (17) ఇద్దరు అన్నదమ్ములు, పెయింటింగ్, డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అద్దె ఇంట్లో తండ్రి నరసింహులు (45) తో జీవనం కొనసాగిస్తున్న అన్నదమ్ములకు విధి రాతవల్ల ఊహించని సంఘటన తమ తండ్రి నరసింహులు శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందారు.తండ్రి అంతక్రియలకు కూడా చిల్లి గవ్వలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని పటేల్ నగర్ కి చెందిన మధు మానవసేవే మాధవసేవ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజును సంప్రదించి, నరసింహులు అంతక్రియలకు ఆర్థిక సహాయం కోరడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని తమ వాట్సాప్ గ్రూప్ లో సభ్యులకు తెలియజేయడంతో మానవతాదృక్పథంతో 24 మంది సభ్యుల సహకారంతో నరసింహులు అంతక్రియలకు 16 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని నరసింహులు ఇద్దరు కుమారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, ఉదారి సత్యనారాయణ యాదవ్, జగపతి, సత్యనారాయణ, తో పాటు స్థానికులు మధు, తదితరలో పాల్గొన్నారు. నరసింహులు అంతక్రియలకు ఆర్థిక సహాయం అందించిన వాట్సాప్ గ్రూప్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రతిభా విద్యాలయంలో  దీపావళి వేడుకలు

 

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ప్రతిభా విద్యాలయంలో ముందస్తుగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడగంటి గంగాధర్, ఉపాధ్యాయులు పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు దీపావళి పండుగను జరుపుకున్నారు.

అక్షర ద స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి :నర్సంపేట పట్టణంలో బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్ , బిట్స్ స్కూల్ ల లో దీపావళి పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి, క్రాకర్స్ బాణా సంచా కాల్చారు. చిన్నారి విద్యార్థిని విద్యార్థులు కృష్ణుడు, సత్యభామ నరకాసుడు వేషధారణతో అందరిని అలంరించారు.ఈ సందర్భంగా నరకాసుర వధ నిర్వహించి దీపావళి ప్రాముఖ్యతను నాటక రూపంలో ప్రదర్శించారు. బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్. ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి దీపావళి పండుగ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల సెక్రేటరి రాజేశ్వర్ రెడ్డి , పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.జ్యోతి, సీ.ఎ.వొ సురేష్ . ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాద్యాయుడి వికృత షష్ఠ!

వేములవాడ,నేటిధాత్రి:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు జక్కుల శివప్రసాద్ ను నిర్బంధించిన గ్రామస్తులు..

–విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, వ్యక్తిగత విషయాలు ఆరా తీయడాన్ని ఆగ్రహించి ప్రశ్నించిన గ్రామస్తులు..
–మందలించేందుకు వెళ్లిన తల్లిదండ్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఉపాధ్యాయుడు..

–సహనం కోల్పోయి సదరు ఉపాధ్యాయుని కుర్చీని ఎత్తేసి ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు..
–ప్రభుత్వ పాఠశాలలో ఉద్రిక్తత వాతావరణం..
— పాఠశాలకు చేరుకున్న పోలీసులు..
— ఉపాధ్యాయుడిని, సస్పెండ్ చేస్తా అని వివరణ ఇచ్చిన , జిల్లా విద్యాధికారి…

గీత కార్మికుల కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తాం

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బబ్బురి ఉప్పలయ్య,మోడెం వెంకటేశ్వర్లు ఎన్నిక

 

కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:  ఈనెల 19, 20, 21 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర మహాసభలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని, కేసముద్రం మండలం నుండి బబ్బురి ఉప్పలయ్య, మోడెం వెంకటేశ్వర్లను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారని బబ్బురి ఉప్పలయ్య మోడెం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా స్థానం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ అవకాశం రావడానికి సహకరించిన ప్రతి ఒక్క కల్లుగీత కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ అవకాశంతో గౌడ కులస్తుల సంక్షేమం,కల్లు గీత కార్మికుల కోసం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని తెలిపారు.పదవి రావడం వల్ల బాధ్యత పెరుగుతుందని,కేసముద్రం మండల కల్లు గీత కార్మిక సంఘం పనితీరును బేరీజు వేసుకొని ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించిన బహిరంగ సభ సమావేశాలు విజయవంతం అయ్యాయని తెలిపారు.మా పై నమ్మకంతో కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు ఎం వి రమణ కు యమగాని వెంకన్న కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గంగపురపు వెంకన్న,బబ్బురు వెంకటమల్లు, గంధసిరి యాకన్న,గంధం వెంకన్న,కామగొని సారయ్య, సాంబయ్య,గంధసిరి వెంకన్న, స్వామి,గంధసిరి విజేందర్, గంధం శ్రీనివాస్,బొమ్మగాని ఎల్లయ్య,కందాలరమేష్ తదితరులు పాల్గొన్నారు.

మళ్ళీ బావిలో పాకురు, నిండిన చెత్త

 

గతంలో తాత్కాలిక చర్యలు, తొంగి చూడాలి అధికారులు

నిర్లక్ష్యంపై గ్రామ ప్రజల అసహనం

కొడిమ్యాల, నేటిధాత్రి:జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మంచినీటి బావిలో పాకూరు, చెత్తతో నిండి ప్రజల పాలిట శాపంగా మారింది. కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డులకు మంచి తాగు నీరు అందించే మంచి నీళ్ల బావి పడువడ్డ బావిలా చెత్త, పాకురు నిండి భయంకరంగా అయింది. అ బావి నీళ్ళే నిత్యం ప్రజలు తాగడం, కనీసం బావిని శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీళ్లు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యం పలు అయ్యే అవకాశం ఉన్నందున, గతంలో కూడ తాత్కాలిక చర్యలు చేపట్టారాని, సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు..

ఉద్యమ వీరుడు స్ఫూర్తితో పోరాటాలు చేయాలి

కొమరం భీం జయంతి వేడుకల్లో గిరిజన సేవ జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:భద్రాద్రి కొత్తగూడెం.మాన్య వీరుడు అదివాసి గోండు బెబ్బులి కొమరం భీం జయంతి సందర్భంగా జల్ జంగిల్ జమీన్ నిదానంతో తిరుగుపాటు పోరాట ఉద్యమ వీరుడు స్ఫూర్తితో ఆయన ఆశయాలు సాధించుట కొరకు నేటి యువత అందరూ కూడా కొమరం భీం ఉద్యమాలు పోరాటాలు చేయాలని ఆదివాసి హక్కులు చట్టాలు సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు వైద్య విద్య ఉపాధి ఉద్యోగం రాజకీయ ఐక్యత తో అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ కొమురం భీం కి ఘన నివాళులు అర్పిస్తున్నాము.ఈ కార్యక్రమంలో గిరిజన సేవక్ సంఘ్ జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర నాయకులు బాడిశ బిక్షం, అరెం ప్రశాంత్, కాకా పృథ్వి రాజ్,కుంజా రవి, తాటి రాజు తదితరులు పాల్గొన్నారు

మునుగోడు నియోజకవర్గంలో ఎంపీ వద్దిరాజు విస్త్రత ప్రచారం

 

మర్రిగూడలో ఇంటింట ప్రచారం,నామాపురం,గుజ్జలలో ఆత్మీయ సమ్మేళనాలు

కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావలసిందిగా ఇతర పార్టీల నాయకులతో మంతనాలు జరిపిన రవిచంద్ర

మునుగోడు నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఘన విజయం

చేకూర్చేందుకు శనివారం విస్త్రత ప్రచారం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,చల్లా

హరిశంకర్,ఆకుల రజిత్ లతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మొదట గట్టుప్పల్ మండలం నామాపురంలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో వారంతా మాట్లాడి గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు.ఆ తర్వాత నామాపురంలో పలు వాడల్లో కాలినడకన తిరిగి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి గురించి వివరించారు.మర్రిగూడ మండల కేంద్రంలో ఎంపీ రవిచంద్ర,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గులాబీ శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.మర్రిగూడలో బీజేపీకి చెందిన,నారాయణపురం మండలం గుజ్జలో కాంగ్రెసు నాయకులలో మంతనాలు జరిపి రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసిన, చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం గురించి ఎంపీ వివరించారు.గుజ్జ రామాలయంలో తెలంగాణను అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసి జాతీయ పార్టీని నెలకొల్పిన కేసీఆర్ ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.అటుతర్వాత మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో వద్దిరాజు ప్రసంగిస్తూ మున్నూరుకాపులు,బిసిల ఉన్నతికి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.ఎన్నికల ప్రచారంలో ఎంపీ వెంట మున్నూరుకాపు ప్రముఖులు విష్ణు జగతి, పర్వతం సతీష్,సత్తినేని శ్రీనివాస్,ఉప్పు సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణ,వాసాల వెంకటేష్, గుండ్లపల్లి శేషగిరిరావు,పాశం కిరణ్ తదితరులు ఉన్నారు.

టిడిపి బలోపేతానికి కృషి చేయాలి

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

నేటిధాత్రి, కైరతాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మాజీ శాసనమండలి సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయనను శుక్ర వారం కొర్రపాటి కిషోర్, అయ్యప్ప, రాజేంద్ర, రిషి వర్మ, హనీష్, సాయి తదితరులు అమీర్ పేట్ లోని తన నివాసంలో మర్యాదగా కలిసి అభినందనలు తెలియజేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 

కరీంనగర్:నేటిధాత్రి 

కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా నగర మేయర్ వై.సునీల్ రావు 3వ డివిజన్ లో పర్యటించారు.కిసాన్ నగర్ లో నూతనంగా చేపట్టిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్,డ్రైనేజీ,సిసి రోడ్ల పనులను కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ తో కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు.అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అన్ని రంగాల్లోని ముందుకు తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నడని మేయర్ సునీల్ రావ్ తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

 


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నబోయిన రవి అన్నారు ఖరీఫ్ సీజన్ లో పండించిన వరి పంట కోతలు ప్రారంభమయు 15 రోజులు గడిచిన ఇప్పటివరకు గ్రామాల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు అని అన్నారు వాతావరణం సహకరించక భారీగా కురుస్తున్న వర్షాలకు రైతులు భయపడి క్వింటల్ 1500 రూపాయలకు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారు అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వంకు మునుగోడు ఎన్నికల మీద ఉన్న శ్రద్ద రైతులపై లేకపోవడం దారుణమన్నారు స్థానిక ఎమ్మెల్యే రైతుల సమస్యలు పట్టించుకోకుండా మునుగోడు లో అభివృద్ధి చేస్తాం అని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని హెచ్చరించారు

నేటి నుంచే జిల్లాలో బాలమిత్ర వారాంతపు శిక్షణ

 


– ఎఫ్ ఎల్ ఎం లో భాగంగా అమలు

– ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం

-తెలంగాణ లోనే మొట్ట మొదటి సారిగా జిల్లాలో అమలు

-బాల మిత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్లజిల్లా, నేటిధాత్రి:
తెలంగాణ లోనే ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు మొట్ట మొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో శ్రీకారం చుట్టిన కార్యక్రమం బాలమిత్ర వారాంతపు శిక్షణ కార్యక్రమం.ఎఫ్ ఎల్ ఎం కార్యక్రమంలో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా 9 వ తరగతి విద్యార్థుల చే బ్యాచింగ్- మ్యాచింగ్ విధానంలో ప్రతి శనివారం మధ్యాహ్నం పూట 1-5 వ తరగతి విద్యార్థులకు మెంటార్ లుగా వ్యవహరిస్తూ వారి అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తారు.

కాగా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ తో కలిసి బాలమిత్ర పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవిష్కరించారు.
కార్యక్రమ అమలుకు సంబంధించి విద్యా శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.

గురుకులం ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించిన ఇంచార్జ్ అర్ సి ఓ డేవిడ్ రాజ్

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి :

భద్రాచలంలో గురుకులం ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలకు మెరిట్ ప్రకారము ఉపాధ్యాయులను పంపించాలని ఇన్చార్జి ఆర్ సి ఓ గురుకులం డేవిడ్ రాజ్ సంబంధిత ప్రిన్సిపాల్ లకు ఆదేశించారు. శనివారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకులం ప్రిన్సిపాల్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మించే గురుకులం కళాశాలకు గురుకులంలో పనిచేసే వారికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వాలని, అలాగే బాలికల కళాశాలలో మహిళ అధ్యాపకులను, బాలుర కళాశాలలో పురుషులను మాత్రమే, నియమించాలని ,ఇటీవల జూనియర్ లెక్చరర్ల పోస్టుల కొరకు అప్లై చేసుకుని నియమితులైన వారిని తప్పనిసరిగా ఆయా కళాశాలలో నియమించాలని, అదేవిధంగా ప్రస్తుతం కళాశాలలో ఖాళీ అయిన పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని ఆయన అన్నారు. ఇంతవరకు గురుకులం పాఠశాలలో కళాశాలలో పనిచేసి వెళ్లిపోయిన వారి జాబితా తయారుచేసి తనకు అందించాలని, ఆ తర్వాత అదే కళాశాలలో పనిచేస్తున్న వారికి మెరిట్ ప్రకారము ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం గురుకుల కళాశాల పాఠశాల లో చదువుతున్న విద్యార్థిని,విద్యార్థుల చదువు పట్ల సంబంధిత ఉపాధ్యాయులు కృషి చేయాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అన్నారు. కొత్తగా నిర్మించే కళాశాలలో సంబంధిత కమిటీల ఆధారంగా వారు సూచించిన దాని ప్రకారం లెక్చరర్లను నియమిస్తామని ఆయన తెలుపుతూ ముఖ్యంగా మెరిట్ ప్రకారము మాత్రమే పరిగణలకు తీసుకొని సంబంధిత అధ్యాపకులను నియమిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, సుదిమల్ల, గుండాల ,దమ్మపేట, భద్రాచలం కిన్నెరసాని ప్రిన్సిపాల్ లు అరుణ్ కుమారి ,హరికృష్ణ, శ్యాం కుమార్ ,దేవదాస్, రవికుమార్ ,ఖమ్మం ఎస్ఓఈ ప్రిన్సిపాల్ బాలస్వామి, గురుకులం పరిపాలన అధికారి నరేందర్ ,తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ హక్కుల రక్షణే కొమురం భీంకు నివాళి

 


 

టిపిటిఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్

 

మహబూబాబాద్,నేటిధాత్రి:అటవీ సంరక్షణ చట్టాల సవరణ పేరుతో అడవి నుంచి ఆదివాసీలను గెంటేయజూస్తున్న కార్పొరేట్ విధానాలను తిప్పికోట్టి ఆదివాసీ,గిరిజన హక్కులను రక్షించినపుడే కొమురం భీం కు నిజమైన నివాళి అని టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ అన్నారు.టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన భీం జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల్,జంగిల్, జమీన్ ల నుండి ఆదివాసీ,గిరిజనులను ఎవ్వరూ విడదీయలేరని అవి వారి జన్మహక్కని అన్నారు. అడవి,ఆదివాసీల రక్షణ కొరకు ఉన్న చట్టాలను నీరుగార్చేలా చేస్తున్న సవరణలు అటవీ సంపదను,గనులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికేనని ఆరోపించారు.దేశ వనరుల మీద 90 శాతం ఉన్న ప్రజల హక్కును నిరాకరించి 10 శాతం సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదగడానికి చేస్తున్న ప్రయత్నాలను అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చుంచు శ్రీశైలం,ఉపాధ్యక్షులు బలాస్టి రమేష్,కార్యదర్శి సోమ విష్ణువర్ధన్ మహాబాద్ మండల బాధ్యులు రాచకొండ ఉపేందర్, ఎస్.విద్యాసాగర్,నెల్లికుదురు బాధ్యులు సంగ శ్రీనివాస్, నాయకులు ఏ.గోవర్ధన్,కోడెం శ్రీనివాస్,కె.వెంకటేశ్వర్లు,పి.రమేష్,ఏ.రవి,ఎస్.కె.సర్వర్, ఎమ్.డి రఫీ పాల్గొన్నారు.

మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు జోరు

 

బచ్చన్నపేట (జనగామ) నేటిధాత్రి:తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మునుగోడు నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి తో కలిసి నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులో తెలంగాణలో అధికారంలోనికి రాబోతుందని, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట కాంగ్రెస్ నాయకులు బాలకిషన్ గౌడ్ , విద్యనాథ్, చల్ల సురేందర్ రెడ్డి,మోహన్ రెడ్డి, సందేలా రాము, మినలాపురం సిద్దులు, కంటెమ్ కర్ణాకర్, హరినాథ్, ఏలిమెల్లి వెంకటేశ్, హరీరాములు, పరమేశ్వర్ రెడ్డి, సంజయ్, కొమ్ము శ్రీధర్, బత్తిని రాజలింగం, అరెళ్ల భాస్కర్, మానేపల్లి నర్సయ్య, బత్తిని సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తుడుందెబ్బ మండల కమిటి ఎన్నిక

 

 

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి :

నూతన కమిటీ సమావేశంలో వచ్చేసిన జిల్లా కమిటి అధ్యర్యంలో మండల నూతన కమిటీ వేయడం జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్యధితులు హాజరైయి 03, 1/70 ఫీసా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయలని మాట్లడడం జరిగింది ఇప్పడు జరిగే ఆర్ ఓ యఫ్ ఆర్ సర్వే ను కూడా ఖచ్చితంగా అమలు చేయలని పోడు భూములకు పట్టాలు ఇవ్వలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు పూనెం శ్రీనివాస్, కార్యదర్శి వజ్జ ఎర్రయ్య, ఈసం సాంబయ్య, కత్తి మల్లయ్య ఆద్యంలో నూతన మండల కమిటీ వేయడం జరింగింది. మండల అధ్యక్షులు గోవిందు నర్సంహరావు, ప్రధాన కార్యదర్శిగా చింత, వెంకటేశ్వర్లు, ఎనుగో వడం జరిగింది ఈ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి 19 దరఖాస్తులు

 

 జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

హనుమకొండ జిల్లా నేటిధాత్రి:

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ ప్రజావాణి కార్యక్రమానికి పందొమ్మిది దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.వీటిలో బ్యాటరీ సైకిల్స్ కోసం నాలుగు, వీల్ చైర్స్ కోసం ఐదు, వ్యక్తిగత లోన్ ల కోసం ఏడు,సదరం సర్టిఫికేట్ ల కోసం మూడు దరఖాస్తులు వచ్చాయని తెలియచేశారు.కా

ర్యక్రమంలో ఆర్డీవో ఎం వాసుచంద్ర,జిల్లా సంక్షేమ అధికారి ఎం.సబిత మరియు జిల్లా సర్వెలెన్స్ అధికారి డాక్టర్ వాణిశ్రీ, డీవిఏహెచ్వో డాక్టర్ కే వి నారాయణ , సిడిపివో కే మధురిమ వ్యవసాయ శాఖ అధికారి మాధవి,ఆర్అండ్బి అధికారి రవీందర్, మెప్మ డీఎంసి రజిత రాణి, అదనపు డీఆర్డీవో రవి, తదితరులు పాల్గొన్నారు.

చెన్నారావుపేట సిఎస్ఐ చర్చిలో కోతకాల పండుగ వేడుకలు

 

 

చెన్నారావుపేట-నేటిధాత్రి:మండల కేంద్రంలోని సి ఎస్ ఐ చర్చిలో శనివారం కోతకాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ యొక్క పండుగ వేడుకల్లో కరీంనగర్ అధ్యక్ష మండలం బిషప్ ది రైట్ రేవా డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ పాల్గొని మాట్లాడారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి ఉండాలన్నారు. ఈ యొక్క పండుగ వేడుకల్లో డైసీన్ మినిస్టర్ సెక్రటరీ కె కనక రత్నం, డైసీన్ ట్రెజరర్ కె.వి కెనడి, వరంగల్ గ్రూప్ చైర్మన్ రెవ సుప్రియ పాస్టర్ చైర్మన్ రేవా సహోదరు, వరంగల్ గ్రూప్ సెక్రటరీ అశోక్, పా స్టేట్ సెక్రటరీ గోపు శ్రీనివాస్, ట్రెజరర్ బండారి బిక్షపతి, యూత్ సెక్రటరీ హనోక్, స్త్రీల మైత్రి సెక్రటరీ గాండ్ల మంజుల, పెద్దలు దొంతి సాయిలు, సాంబయ్య, రవీందర్, కార్తీక్, శ్రీను, రంజిత్, భాస్కర్, అరుణ్ కుమార్, ప్రదీప్ కుమార్, ఉదయపాల్, అభిలాష్ ,గౌతమ్, రమేష్, రవి, శ్రీను ,సందీప్,ప్రమోద్ సవిత, జ్యోతి, సువాసిని, కృపాంజలి, సిస్టర్ స్వరూప, మేరీ ,రిబ్కా, అభినయ, హాసిని, పలు గ్రామాల చెందిన భక్తులు పాల్గొన్నారు.

ప్రొ. జి.ఎన్ .సాయిబాబా విడుదలకై మహారాష్ట్ర హైకోర్ఠు తీర్పుపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను రద్దుచేయాలి.

ఉమ్మడీ వరంగల్ జాయింట్ యాక్షన్ కమిటీ.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి: ఉమ్మడి వరంగల్ దివ్యాంగుల జాక్ 90శాతం వికలాంగుడైన ఢిల్లీ

యూనివర్సిటీ ప్రొఫేసర్ సాయిబాబా విడుదలకై మహారాష్ట్ర హైకోర్టు తీర్పు నిలుపుదలకై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన జరిపి తదనంతరం

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు మెమోరాండం

సమర్పించారు.

ఈ కార్యక్రమంలో దివ్యాంగుల జాక్ కన్వీనర్ నల్లెల్ల రాజయ్య,వి-జాక్ సభ్యులు మరియు అంధనిరుద్యోగులైన

బి.ధనుంజయ్ ,ప్రవీణ్ కుమార్ ,మహేందర్ ,వీరన్న ,నర్సింహా,దిలీప్ ,మహేశ్వరి,అశ్విని,మౌనిక తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కన్వీనర్ నల్లెల్ల రాజయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా తదితరులను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేనిన తీర్పుపై సుప్రీం కోర్టు “స్టే” ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్దమని ,వెంటనే బాంబే హైకోర్టు నిర్ధోషులుగా పేర్కొని ప్రకటించిన వారందరిని బేషరతుగా విడుదల చేయాలనీ ఉమ్మడి వరంగల్ దివ్యాంగుల జాక్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

న్యాయ వ్యవస్థ రాజ్యాంగ యంత్రాంగంలో భాగం కావడం వల్లనే కుట్రపూరితంగా కక్ష గట్టి ఆగమేఘాలపై తీర్పులు ఇవ్వడం అప్రజాస్వామికం అన్నారు.

ఇప్పటికైనా వెంటనే సుప్రీంకోర్టు మరోసారి నిష్పక్ష పాతంగా పరిశీలించి సాయిబాబాతో పాటు మిగతా నలుగురు ఆదివాసులను విడుదల చేసి

న్యాయ వ్యవస్థ పరువు కాపాడాలని ఉద్భోదించారు.

అక్షర యోధుడికి కన్నీటి నివాళి..

వేములవాడ:ప్రతినిధి నేటిధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శనివారం నవ తెలంగాణ సీనియర్ రిపోర్టర్ వినోద్ అన్నకు టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ వినోద్ అన్న ఆయన కథనాలతో విశేషమైన ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. వార్తల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్న అన్న వివరించి చెప్పేవాడు, అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు.. టీయూడబ్ల్యూజేహెచ్143 పక్షాన వారి కుటుంబానికి ప్రెస్ క్లబ్ పక్షాన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం, ప్రెస్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని పెద్దదిగా ఉండి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. ఆయన వార్త కథనాలు తోటి జర్నలిస్టులకు స్ఫూర్తి. వినోదన్న కలం యోధుడని కొనియాడారు .ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి పాశం, మహమ్మద్ రఫీ, సయ్యద్ అలీ ,ఒడియాల వేణు, సిహెచ్ దేవరాజ్, దూస రాజేందర్, ఎస్ వేణు, సంటి రాజేందర్, బండి రజనీకాంత్, సాయి, బండి శ్రీకాంత్, అసీం, వెంకటేష్, షబ్బీర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version