పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించాలి

జేరిపోతుల జనార్దన్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,తెలంగాణ

సిద్దిపేట జిల్లా: నేటి ధాత్రి
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఇతర వృతివిద్యా కోర్సుల ఫీజులను వెంటనే తగ్గించాలని, ఫీజులు పెంచుతున్నట్టు ఇచ్చిన జీవోను వెనక్కు తీసుకోవాలని అదే విధంగా ఈ మధ్య జరిగిన గ్రూప్-1 పరీక్షలలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్దన్ అన్నారు.. శుక్రవారం నాడు సిద్దిపేట లోని స్థానిక ఎడ్ల గురువారెడ్డి భవన్ లో ఆయన మాట్లాడారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఫీజులను గత ఫీజుల కంటే భారీగా పెంచి విద్యార్థులపై మోయలేని భారం మోపిందని విమర్శించారు.. కరోనా తరువాత ఇప్పుడు ఫీజులు పెంచడంతో తమ పిల్లలను ఉన్నత విద్యను అందించలేమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు..ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెంచిన ఫీజుల జీవోలను వెనక్కి తీసుకోవాలన్నారు..ఫీజుల పెంపు ప్రయివేటు కాలేజీలకు కొమ్ముకాసే విధంగా ఉందని మండి పడ్డారు.. రాష్ట్రంలోని 159 ఇంజనీరింగ్ కాలేజీల్లో టిఏఎఫ్ఆర్ సి సిఫారసులతో ప్రభుత్వం ఫీజులు పెంచడం సరికాదన్నారు.. కనీస ఫీజులను సైతం 35 వేల నుండి 45 వేల రూపాయలకు పెంచారని,పెంచిన ఫీజులతో రాష్ట్రంలోని 40 కాలేజీల్లో లక్ష దాటిందని ఆందోళన వ్యక్తం చేశారు.. ఫీజులను పెంచడం ఠీ పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవుతారని, వెంటనే జీవోలను వెనక్కు తీసుకోవాలన్నారు..
అదే విధంగా ఈ నెల 16 వ తేదీన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని, రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనల ప్రకారం ఉదయం10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించగా హైదరాబాద్ లలాపేట్ శాంతినగర్ లోని సెయింట్ ప్రాన్సిస్ డి సెల్ఫ్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో మాత్రం మధ్యాహ్నం1 గంట నుంచి 3.30 నిర్వహించారని,ఉదయం నిర్వహించాల్సిన పరీక్ష మధ్యాహ్నం నిర్వహించడం ఏంటని వారు ప్రశ్నించారు.. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించిన ఆయా సెంటర్ లపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు..టిఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు.. వేలాదిమంది అభ్యర్థుల భవిష్యత్తు పై ఆధారపడిన గ్రూప్-1 పరీక్ష నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఉన్నతస్థాయి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు సంగెం మధు,జిల్లా అధ్యక్షులు చిట్యాల శేఖర్ లు ఉన్నారు..

పాఠశాలను సందర్శించిన డీఈవో

మహబూబాబాద్,నేటిధాత్రి:

మహబూబాబాద్ మండలం లో ఎంపీపీ ఎస్ నందమూరి నగర్ ఉర్దూ మీడియం పాఠశాల ను ఆకస్మికంగా జిల్లా విద్యాధికా అరేయ్ డాక్టర్ అబ్దుల్ హై సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యలు పరిశీలన చేశారు.మూడవ వ తరగతి విద్యార్థిని ఎండి.ముష్క్కాన్ ను ఉర్దూ మరియు ఇంగ్లీష్ పై పలు ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టం జరిగింది.హెచ్ ఎం ను పాఠశాలలో విద్యా అభివృద్ధి తగిన సలహాలు సూచనలు చెయ్యటం జరిగింది.అలాగే ప్రతి పాఠశాల లో ఎఫ్ ఎల్ ఎన్ (ఫాండేషన్ లిటెర్రస్సి న్యూమరాస్ ప్రోగ్రాం) సమర్థవంతగా నిర్వవించవలెనని,దీనికి సంబందించిన లెషన్ ప్లాన్ ప్రకారం టిఎల్ ఎం తయారు చేసి మైక్రో లెవెల్ బోధన గావించాలని ప్రతి ఉపాధ్యాయులు తెలంగాణ స్టూడెంట్ ట్రాకర్ ఆప్ డౌన్ లోడ్ చేసుకొని ప్రతినెలా ప్రగతి నమోదు చెయ్యాలన్నారు.ఎట్టి పరిస్థితి లో నిర్లక్ష్యం చేయకూడదని చేసిన వారిపై రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.డీఈవో వెంట ఎ సిజిఈ మందుల శ్రీరాములు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం

 

ములుగు జిల్లా,నేటిధాత్రి:ములుగు జిల్లా కేంద్రంలోని రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు యొక్క ప్రాధాన్యత వివరించారు జిల్లా ఉద్యాన అధికారి బీ వి రమణ ఈ సంవత్సరం ములుగు జిల్లాలోని 1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్యాన మరియు వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కృషి చేద్దామని ఉద్యాన మరియు వ్యవసాయ అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ పథకం నందు మొక్కలకు 90% రాయితీ పోను రైతు వాటాగా 20 రూపాయలు ఒక్క మొక్క కు చెల్లించవలెను అదేవిధంగా డ్రిప్ కొరకు ఎస్సీ ఎస్టీ రైతులకు 100% మరియు మిగతా రైతులకు 90 శాతం రాయితీ ఇవ్వబడును మొక్కల నిర్వహణ కొరకు సంవత్సరానికి హెక్టార్కు 5వేల రూపాయల చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతర పంటల సాగు కొరకు హెక్టార్కు 5వేల రూపాయలు చొప్పున మొదటి మూడు సంవత్సరాలు ఇవ్వబడును అని తెలియజేశారు వ్యవసాయ నివిస్తరణ అధికారులను తమ క్లస్టర్ నందు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సాహనిచ్చగలరని సూచించారు ఈ సమావేశం కు జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా ఉద్యాన అధికారి ములుగు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మండల వ్యవసాయ అధికారులు ఉద్యాన అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు ఆల్ఫామ్ కంపెనీ ప్రతినిధులు మరియు డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు

ప్రభుత్వస్కూల్లో ముందస్తు దీపావళి సంబురాలు

 

భద్రాద్రి కొత్తగూడెం

జిల్లా,నేటిధాత్రి:భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ ఇందిరా నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాధమిక పాఠ శాల లో శనివారం ముందస్తు దీపావళి సంబురాలు నిర్వ హించారు. దీపావళి పండుగ ప్రాధాన్యత గురించి విద్యార్థులకు హెచ్ఎం ఎం. జ్యోతి రాణి వివరించారు.బాణాసంచా కాల్చే సమయంలో, దీపాలు వెలిగించే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు తెలియజేప్పారు.పటాకులు కాలుస్తూ విద్యార్థులు ఎంజాయ్ చేశారు. స్కూల్ హె చ్ఎం జ్యోతి రాణి ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో టీచర్స్ ఇన్నయ్య, సరస్వతి, సుజాత,విద్యార్థుల తల్లి దండ్రులు కళ్యాణి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

కొమరం భీమ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన టిపిసిసి సభ్యులు వగ్గెల పూజ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నేటిధాత్రి: అశ్వరావుపేట .జల్ జంగిల్ జమీన్ అని నినాదించి ఆదివాసుల హక్కుల అలుపెరగని పోరాటం చేసిన స్వయంపాలన అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించిన అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకురాలు టి పి సి సి సభ్యులు వగ్గెల పూజ .

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

 

తంగళ్ళపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో  తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు నక్క రవి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులైన నాంపెల్లి కవిత బాలరాజు 29000, అస్మ బేగం ఫజల్ 18500, బండి దేవదాస్ రామయ్య 18000, జే మల్లేశం నారాయణ 20000, పెద్ది దేవేంద్ర ఎల్లయ్య 7000, వి శైలజ తండ్రి తిరుపతి 20000, చెక్కులను  సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్నలింగం, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, తెరాస నాయకుడు బుస్సలింగం, గుర్రం కిషన్ గౌడ్, తంగళ్లపల్లి శ్రీనివాస్, అమరగొండ ప్రశాంత్, చేతుల మీదిగా అందజేయడం జరిగింది.

డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు

రామారెడ్డి,నేటిధాత్రి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్. ఉప్పల్ వాయి. గిద్ద గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం కామారెడ్డి కళాశాల లకు సమయనుకూలంగా ఉదయం 2 ట్రిప్పులు సాయంత్రం 2ట్రిప్పులు ఆర్టీసీ బస్ వేసినందుకు డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు మరియు మా సమస్య ను అధికారులకు వివరించి బస్ ఎపించినందులకు ఎమ్మెల్యే సురేందర్ కి. ఎంపీపీ దశరథ రెడ్డి కి మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు కి ఉప్పల్ వాయి ఎంపీటీసీ ఉమాదేవి దత్తాద్రి కి ఇరు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గురుమూర్తి.లచ్చిరెడ్డి. జరా. గంగయ్య.భూంపల్లి దత్తాద్రి. రామగౌడ్.రంజిత్ గౌడ్.దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలి

 

రాజన్న సిరిసిల్ల జిల్లా, నేటిధాత్రి: కోర్ట్ ప్రాంగణంలో జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ సిరిసిల్ల N. ప్రేమలత మరియు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మరియు పోలీస్ అధికారులతో 12-11-2022 రోజున జరుగు జాతీయ లోక్ అదాలత్ పైన సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ..12-11-2022 రోజున జరుగబోయే జాతీయ లోక్ అదాలత్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించి,పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి కృషి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు..
ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జిలు శ్రీమతి శ్రీలేఖ, సట్టు రవీందర్, జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య,ప్రతీక్ సిన్హా, ఏపీపీ లు సతీష్ కుమార్,విక్రాంత్, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, డిఎస్పీ లు ,విశ్వప్రసాద్ నాగేంద్రచారి, సి.ఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, వెంకటేష్,బన్సీలాల్, శ్రీలత,నవీన్ కుమార్, ఎస్.ఐ లు కోర్ట్ కానిస్టేబుల్ పాల్గొన్నారు..

 

పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన ఊకంటి గోపాలరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

కొత్తగూడెంలోని జడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఈనెల 28న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినము సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏడవ జూనియర్ వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన షిప్ టోర్నమెంట్స్ కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్నట్లు విలేకరుల సమావేశంలో జిల్లా వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి తూము చౌదరి, నాగేందర్ త్రివేణి, సోమిరెడ్డి, రజాక్, పోసాని వీరభద్రం, వడ్డం సతీష్, మైనార్టీ నాయకులు గౌస్, దేవరగట్ల ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ మొగుళ్ల భద్రయ్య కు సన్ రైజర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

 

ములుగు జిల్లా,నేటిధాత్రి: ములుగు జిల్లా జాతీయ మానవ హక్కుల మండలి ఎన్ హెచ్ ఆర్ సి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారిని సన్ రైజర్స్ హై స్కూల్ అధినేత శ్రీ పెట్టo రాజు మరియు వైస్ ప్రిన్సిపాల్ బల్గూరి జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడంజరిగింది.సామాజిక ఉద్యమాలపై రాజీలేని పోరాటాలు చేస్తూ పేద వర్గాలకు న్యాయం చేస్తూ మానవ హక్కులను కాపాడుతూ నేడు జాతీయ మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం చాలా సంతోష దాయకమైన విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు. డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు మరింత ఎత్తుకు ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగినది

డాక్టర్ మొగుళ్ల భద్రయ్య కు సన్ రైజర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

ములుగు జిల్లా,నేటిధాత్రి: ములుగు జిల్లా జాతీయ మానవ హక్కుల మండలి ఎన్ హెచ్ ఆర్ సి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారిని సన్ రైజర్స్ హై స్కూల్ అధినేత శ్రీ పెట్టo రాజు మరియు వైస్ ప్రిన్సిపాల్ బల్గూరి జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడంజరిగింది.సామాజిక ఉద్యమాలపై రాజీలేని పోరాటాలు చేస్తూ పేద వర్గాలకు న్యాయం చేస్తూ మానవ హక్కులను కాపాడుతూ నేడు జాతీయ మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం చాలా సంతోష దాయకమైన విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు. డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు మరింత ఎత్తుకు ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ఎంపిటిసి కోడి అంతయ్య బియ్యం అందజేత

ఎంపిటిసి కోడి అంతయ్య బియ్యం అందజేత

తంగళ్ళపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గ్రామపంచాయతీలో కార్మికుడిగా పని చేసి ఇటీవల చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా బూడిది రాములు కుటుంబ సభ్యులకు స్థానిక ఎంపిటిసి కోడి అంతయ్య 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసి కోడి అంతయ్యకు కృతజ్ఞతలు తెలిపిన రాములు కుటుంబ సభ్యులు.

ప్రజాసమస్యల పరిష్కారం దిశగా పని చేయాలి

 

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బోయినపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సిరిసిల్ల జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ… ప్రతి జనరల్ బాడీ మీటింగ్ జిల్లా అధికారులు పాల్గొనాలి.జనరల్ బాడీ అంటే తూతుమంత్రంగా వచ్చి వెళ్తున్నారు ఇలా ఇంకోసారి కాకుండ అధికారులకు ఆదేశించారు….
బోయినపల్లి మండల అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలి రాష్ట్ర ప్రభుత్వం మనకు అండగా ఉంది..మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు…
ఆరోగ్య రహిత సమాజం కోసం మనము ముందుకు సాగాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లె ప్రగతి ద్వార గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమైంది.
ఏడు సంవత్సరాల క్రితం అంటువ్యాధులు వచ్చేవి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అంటు వ్యాధులు తగ్గిపోయాయి.
24గంటల కరెంటు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైంది.
పల్లె ప్రగతి ద్వార గ్రామ పంచాయతీలకు నేరుగా ప్రతి నెల నిధులు వస్తున్నాయి.
ఈ నిధులు రావాలంటే గతంలో ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతు ఉండేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.పెన్షన్లు ప్రతి నెల నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో జమ అవుతున్నాయి.దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి అనేక పథకాలు అమలు అవుతున్నాయి.దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీళ్ళు వస్తున్నాయి.పల్లె దవాఖానాల ద్వారా పేదల ఆరోగ్యం కోసం పని చేస్తున్నాం.550కోట్లతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని అన్నారు.

గడ్డం.రాణి చిత్రపటానికి నివాళులు అర్పించిన టీపీసీసీ సభ్యులు నాగాసీతారాములు

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,నేటిధాత్రి:

కొత్తగూడెం నియోజకవర్గం, సుజాత నగర్ లో గడ్డం.రాజశేఖర్, సురేందర్,రాజేందర్ సోదరుల మాతృమూర్తి అయిన గడ్డం.రాణి చిత్రపటానికి పూలమాల వేసి,నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపిన టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ మడిపల్లి. శ్రీనివాసులు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంజాల. శ్రీనివాసరావు. పాలకుర్తి.అంజి దొంచవరపు.శ్రీను, వెంకన్న,జానిమియా తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం

రక్తదానం మహాదానం,రక్తదానంపై అపోహలు వద్దు : ఎస్పీ

భద్రాద్రి కొత్తగూడెం, నేటిధాత్రి: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలు నందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజం కోసం,దేశం కోసం,రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు.ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు.వారి త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు.పేద ప్రజలు,బాధితులకు సత్వర న్యాయం అందించడం,ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే వారి త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు. థలసేమియా,క్యాన్సర్,హిమోఫీలియా,రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి,ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని,రక్తదానం చేసి అటువంటి వారి ప్రాణాలను కాపాడటం ద్వారా మనకు కూడా మంచి చేకూరుతుందని అని అన్నారు.రక్తదానం మహాదానమని,రక్తదానంపై అపోహలు వద్దని ఎస్పీ అన్నారు.ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడానికి ఈ శిబిరాల ద్వారా సేకరించిన రక్తం ఉపయోగపడుతుందని తెలియజేసారు.ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి ప్రతీ 5 నెలలకొకసారి రక్తదానం చేయడం ద్వారా శరీరం మరింత ఉత్సాహవంతంగా మారుతుందని అన్నారు.ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు సబ్ డివిజన్ పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.అదేవిధంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన పోలీస్అధికారులు ,సిబ్బంది, యువత కు ప్రజలందరికీ కృతజ్ఞతలు, తెలిపారు .డిఎస్పీ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం ద్వారా 130 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని,ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కొత్తగూడెం పట్టణ,పరిసర ప్రాంతాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు,ఎస్బి ఇన్స్పెక్టర్ స్వామి,సిఐలు రమాకాంత్,సత్యనారాయణ, రాజు,అబ్బయ్య,వసంత్ కుమార్,ఆర్ఐలు దామోదర్,కామరాజు,ఎస్సైలలు,డాక్టర్ రవిబాబు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

ఘనంగ మహనీయుల జయంతి వేడుకలు

గోదావరి ఖని,నేటిధాత్రి: గోదావరిఖని లక్ష్మీనగర్ లోని న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో ఆదివాసుల హక్కుల కోసం అలాగే నిజాం నిరంకుశ పాలనను ప్రశ్నించిన గోండు బెబ్బులీ కొమరం భీము మరియు నిజాయితి కి మారు పేరు అయిన మాజి ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ జయంతి పార్టీ కార్యాలయంలో ఘనంగ నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జె వీ రాజు మాట్లాడుతూ ఎస్.ఆర్.శంకరన్ సేవలను కొనియాడుతూ ప్రభుత్వ ఫలాలు ,సేవలు ప్రతి ప్రజకు అందేలా మరియు ఎలాంటి ఆర్బాటలకు పోకుండా నిడారంబరతతో ప్రజల సమస్యల్ని తన సమస్యగా భావించి ప్రజలకి ఎప్పుడు ఏమి కావాలో అప్పటికప్పుడు రూపకల్పన చేసి ప్రజల్లో ఒక మంచి అధికారిగా పేరుపొందిన వారి జయంతి ఘనంగా జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం అని అన్నారు.
అలాగే గోండు వీరుడైన కొమరం భీమ్ గారు అలనాటి నిజాం నిరంకుశపాలను వ్యతిరేకిస్తూ ఆదివాసుల హక్కుల కోసం తను చేసిన ఉద్యమాలను కొనియాడుతూ వారిని కీర్తిస్తూ వారికి నివాళులర్పిస్తూ వారి జయంతిని కూడా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించామని వేముల అశోక్ తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగమ తిరుపతి వేముల అశోక్ మహిళా నాయకురాలు గంట భబిత సోని, పోగుల శేకర్ అఫ్రాజ్ కార్పొరేషన్ ఇంచార్జ్ ముఖేష్. సదన్ కుమార్ యాదవ్ వీరందరు కూడా పాల్గొని మహనీయుల జయంతి సందర్భంగా వారి ని ఆదర్శంగా తీసుకోవాలి అని పిలువును ఇచ్చి వారి సేవలను కొనియాడారు.

కొత్తగూడెం ఏరియా జి.కె.ఓ.సి. నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటిధాత్రి:

చుంచుపల్లి మండలం. రుద్రంపూర్.జి.కె.ఓ.సి నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 2021 సందర్బముగా జరిగినవి. మేనేజర్ కరుణాకర్ రావు అధ్యక్షతన ఏర్పటు చేసిన ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌ శ్రీ జక్కం రమేశ్ . జి.ఎం. హెచ్‌ఆర్‌డి బి‌హెచ్ వెంకటేశ్వర రావు, టి‌బి‌జి‌కే‌ఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ . ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి గారు, జి.కె.ఓ.సి ప్రాజెక్టు ఆఫీసర్ రమేశ్ , హాజరు అయినారు. కార్మికులను ఉద్దేశించి వీరు మాట్లాడుతూ ..రక్షణ సంభంధించి విషయాలను వారికి తెలియజేయడ మైనది. రక్షణ విషయాలను పాటల ద్వారా నాటికల ద్వారా కళాకారులు తెలియ జేసినారు. 2019 52 వ వార్షిక రక్షణ వారోస్తవాల్లో జి.కె.ఓ.సి మైన్ కు గ్రూప్ 2 లో మొదటి బహుమతి, ఓవరాల్ ఎన్విరాన్మెంట్ లో 2 వ బహుమతి పొందినది అని తెలియ జేసినారు.ఈ కార్యక్రమములో ఎస్.ఓ.ఎం. (పి.పి) కార్పొరేట్ డి. శ్యామ్ సుందర్, డి‌జి‌ఎం (ఈ &ఎం) హెచ్.ఆర్.డి. కార్పొరేట్ కె. రామోహన్, ఎస్.ఎస్.ఎస్.ఓ. యెల్లందు ఏరియా పి. బాలాజి నాయుడు, అడిషనల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ ఎం. ప్రసాద్,(మైనింగ్) డి. రాజకుమార్,(ఎలక్రీకల్ ) బి. రవీందర్, డబల్యూ.ఎం. ఐ ఐ.(మెకనికల్ ) ఏ. సదానందం, సీనియార్ సెక్యూరిటి ఆఫీసర్ రమనా రెడ్డి, మధుకర్ ఎస్.ఈ, పిట్ సెక్రెటరి చెరిపల్లి నాగరాజు, గోపు కుమార్, మురాద్, భీముడు, విప్లవ రెడ్డి, కుమారస్వామి, 11 మెన్ కమిటీ సబ్యులు కాపు కృష్ణ, సేఫ్టీ కమిటీ మెంబర్లు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, జీనుకుల సదానందం కళా బృందం, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు, డి‌ఎల్‌ఆర్ కార్మికులు పాల్గొన్నారు

త్రివేణి స్కూల్లో ముందస్తు దీపావళి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటిధాత్రి:

భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో గల త్రివేణి స్కూల్ నందు ముందస్తు దీపావళి వేడుకలు జరుపుకున్నారు, ఈ యొక్క దీపావళి గురించి ప్రిన్సిపాల్ జంగాల మంజుల మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు, జరుపుకునే పండుగల లో దీపావళి పండుగ కూడా ఒకటని ఎంతో ప్రాముఖ్యత కూడుకున్నదని నరక చతుర్దశి నాడు సత్యభామ నరకాసురుని ఏ విధంగా వధించినది ఎందుకు వధించాల్సి వచ్చింది అని దీపావళి యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పినారు, మరియు పిల్లలందరూ కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని చెప్పినారు, పిల్లలకి, అధ్యాపక బృందానికి, విద్యార్థినీ, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, దీపావళి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ యొక్క కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కాలుమిల్లి విమలాదేవి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాబురావు సార్ అకడమిక్ ఇంచార్జ్ నరేష్, క్యాంపస్ ఇంచార్జ్ సందీప్ రెడ్డి, విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన వోరగంటి

 


శంకరపట్నం నేటిధాత్రి :మండల కేంద్రంలో,తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ సదాశివ ఫైర్ వర్క్ దీపావళి టపాకాయల దుకాణమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడంచాలా సంతోషం అని,వారిని ప్రశంసిస్తూ,హర్షం వ్యక్తం చేసి, యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు, యువకులు, వోరగంటి యువసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మాత శిశు హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

 

డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి

కరీంనగర్ నేటిధాత్రి :కరీంనగర్ పట్టణ కేంద్రం లో ప్రభుత్వ మాత శిశు హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకొని విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న డాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు.

స్థానిక మాత శిశు ఆస్పటల్ ముందు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అనంతరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ మాత శిశు హాస్పిటల్ లో గర్భని స్త్రీలకు సౌకర్యాలు కల్పించాలి జన్మించిన శిష్యులకు అందుబాటులో మందులు ఉంచాలని గర్భిణీ శ్రీ తో అనుచిత వ్యాఖ్యలు చేసిన మత్తువైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకొని ఆయనకు విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్త్రీల వైద్య నిపుణులు సమయపాలన పాటించకపోవడం వల్ల గర్భని స్త్రీలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి శిశు ఆస్పత్రిలో కనబడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగే నీరు సరిపడే కుర్చీలు ఏర్పాటు చేయాలని వారు అన్నారు. డెలివరీ అయిన తర్వాత రూమ్లలో ఫ్యాన్లు ఇతర సౌకర్యాలు లేకపోవడం వల్ల గర్భని స్త్రీలు ఇబ్బంది పడుతున్నారని వారు అన్నారు. చిన్నపిల్లలకు పూర్తిస్థాయిలో మందులు అక్కడ లేకపోవడం వల్ల ప్రైవేట్ మెడికల్ షాపులకు ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని వారు అన్నారు.డెలివరీ అయిన సమయంలో స్టాప్ నర్సులు ఆయలు ఒక్కొక్క గర్భని శ్రీ దగ్గర సుమారు 1000 నుండి 2000 వరకు వసూలు చేస్తున్నారని అన్నారు.RMO సూపర్డెంట్లు పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల వైద్యుల సమయపాలన పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవడంలో సూపర్డెంట్ నిర్లక్ష్య వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులను గుర్తించి తక్షణమే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఇప్పటికైనా వైద్యశాఖ మంత్రి ప్రజలకు సకాలంలో వైద్యం అందించే విధంగా ఎప్పటికప్పుడు హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో మరింత ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివరాజ్ పటేల్, నవీన్, శివ రాహుల్, కిషన్ ,మహేష్ అరుణ్, రఘు ,రాజేందర్ లక్పతి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version