badi baata, బడిబాట

బడిబాట

మండలంలోని పాత్రపురం గ్రామంలో ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని చేపట్టారు. పాత్రపురం గ్రామ పంచాయితీలో శుక్రవారం అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ బడిబాట కార్యక్రమంలో ‘ప్రైవేటు బడి వద్దు…అంగన్‌వాడీ ముద్దు’, ఇంటింటికి అంగన్‌వాడీ అనే నినాదంతో పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని, ఉచితవిద్య, పోషకాహారంతోపాటు ఆరోగ్యంగా పిల్లల ఎదుగుదల ఉంటుందని గ్రామస్తులకు, తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు. ఫ్లకార్డులు పట్టుకుని గ్రామస్తులలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కష్ణార్జున్‌రావు, వార్డుమెంబరు కారం వెంకటలక్షి, సూపర్‌వైజర్‌ రమాదేవి, అంగన్‌వాడీ టీచర్లు విజయ శుషంతల, చుక్కమ రామకష్ణ, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

hotel sharanyalo agnipramadam, హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం

హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం

వరంగల్‌ స్టేషన్‌ రోడ్డులోని హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించవచ్చునని పలువురు భావిస్తున్నారు. హూటల్‌ సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి భారీ నష్టం వాటిల్లకుండా చూశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. లేనిపక్షంలో భారీ ఆస్తినష్టం సంభవించే అవకాశాలు ఉండేవని హూటల్‌ సిబ్బందితోపాటు పలువురు భావిస్తున్నారు.

antharjathiya sadasuku doctor rajkumar, అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్‌ రాజ్‌కుమార్‌

అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్‌ రాజ్‌కుమార్‌

దుగ్గొండి మండల ప్రశాంతి మహిళా సమాఖ్య ఏపీఎం డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌ అంతర్జాతీయ యువత సదస్సుకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 27 నుండి వచ్చే నెల 1తేదీ వరకు బ్యాంకాక్‌, థాయిలాండ్‌ దేశాల్లో జరిగే అంతర్జాతీయ యువత సదస్సుకు భారతదేశ ప్రతినిధిగా హాజరవుతున్నట్లు తెలిపారు. యువత నిర్మాణ పాత్ర, యువత రాజకీయం, యువత నాయకత్వ లక్షణాలు, రాబోయే తరాలకు యువత ఇచ్చే సందేశాలు, సామాజిక బాధ్యతలు తదితర అంశాలపై ఈ సదస్సులలో మాట్లాడనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 12దేశాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఘనత తనకే దక్కిందని గుర్తుచేశారు. బ్యాంకాక్‌ దేశం నుండి 2వ సారి ఆహ్వానం అందిందని, గత 25సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. భారతదేశ ప్రభుత్వం నుండి 4 జాతీయస్థాయి పురస్కారాలు, అలాగే ప్రపంచ దేశాలల్లో 5సార్లు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నట్లు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

vithanthu dinostavanni vijayavantham cheyali, వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బాలవికాస ప్రతినిధి గోర్కటి రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. దుగ్గొండి మండలంలోని పొనకల్‌, రేబల్లె గ్రామాలలో ఆదర్శ గ్రామ నిర్మాణంలో భాగంగా బాలవికాస ఆధ్వర్యంలో ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ఉద్దేశించి గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్త చనిపోయిన మహిళలకు బొట్టు, పూలు, గాజులు తీసివేయడం ప్రపంచంలో ఏ దేశంలో లేని మూఢాచారం భారతదేశంలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. బాలవికాస గత 25సంవత్సరాల నుండి సభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తూ అవగాహన కల్పిస్తూ సామజిక ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. అతి చిన్నవయసులో ఉన్న వితంతు మహిళలు అవగాహన లేక ఆత్మహత్యలకు చేసుకుంటున్నారన్నారు. ఆదర్శ గ్రామాల సర్పంచ్‌లు మూఢ ఆచారాలను అరికట్టి ఆదర్శంగా నిలవాలని కోరుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొనకల్‌ సర్పంచ్‌ బొమ్మగాని ఊర్మిళ, రేబల్లె సర్పంచ్‌ గటికే మమత, భాగ్యలక్ష్మి, సుజాత, భాగ్య, సమత, కవిత, సరస్వతి, లలిత, రాజమణి, సంధ్య, కోమల, రాజక్క, అరుణలతోపాటు పలువురు పాల్గొన్నారు.

అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…?

అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…?

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ పేరుతో అవినీతికి పాల్పడి, ప్రభుత్వ సొమ్మును మెక్కేసిన సూపరింటెండెంట్‌ సాయిబాబా, డిఐఈవో లింగయ్యలను ఎట్టి పరిస్థితిలోను వదలొద్దని, వారి అవినీతిని బయట పెట్టడానికి తక్షణమే విచారణ కమిటిని వేసి కాజేసిన సొమ్మును రికవరీ చేయడంతో పాటు వెంటనే సస్పెండ్‌ చేయాలని జిల్లా ప్రజలు, ప్రజిసంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామికవాదులు, సీనియర్‌సిటిజన్లు, మేధావి వర్గం కోరుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై కొందరు అన్ని ఆదారాలు సేకరించినట్లు సమాచారం. ఆదారాలను తీసుకొని అన్ని సంఘాలను కలుపుకొని సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్పిస్తున్నామని తెలిపారు.ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో సీఎం కేసీఆర్‌ను కలవటం కుదరలేదని ఎన్నికల బీజీ అయిపోయినందున, ఇప్పుడు కలువడానికి అపాయింట్‌మెంట్‌ కొరకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఆర్జేడికి ఫిర్యాదుచేసినా పట్టించుకోని వైనం

అవినీతిపై విచారణ కమిటినీ వేయాలని, బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై ‘నేటిధాత్రి’లో వచ్చిన కథనాలను జతపరుస్తూ వరంగల్‌ ఆర్జేడి ప్రదానకార్యాలయంలో నేటిధాత్రి ప్రతినిధి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఫిర్యాదుపై ఎలాంటి స్పందన లేదని, అవినీతికి పాల్పడిన వారికి ఆర్జేడి కార్యాలయంలో ఎవరైనా సహకరిస్తున్నారా? అనే అనుమానం లుగకమానదు.ఓ వైపు ఇంటర్‌బోర్డులో నిర్లక్ష్యం వెటాడుతుండగా మరో వైపు వరంగల్‌ ఆర్జేడి కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోవడంలేదో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నది. అసలు ఫిర్యాదు ఆర్జేడికి అందించారా? అందించలేదా అన్న సందేహం కలుగుతున్నది.

కేసీఆర్‌ పాలనపై ప్రజలకు అపారనమ్మకం

రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనై ప్రజలకు అపారనమ్మకం ఉన్నది. ఆయన చేపడుతున్న అబివృద్ది కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ నేపధ్యంలో వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై కూడా చర్యలుంటాయని ప్రజలు భావిస్తున్నారు. తక్షణమే విచారణ కమిటిని నియమించి అవినీతిని బయటపెట్టి బాధ్యులను ఉద్యోగాల నుండి సస్పెండ్‌ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అధికార యంత్రాంగం నమ్మకాన్ని వమ్ముచేయొద్దు

సీఎం కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్నివమ్ముచేయకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాయలాల్టో ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్న కేసీఆర్‌ ఆదేశాలను అధికారయంత్రాంగం తూ.చ. తప్పకుండా పాటించినప్పుడే కేసీఆర్‌ ఆదేశాలను పాటించినట్టవుతుందని, అప్పుడే కేసీఆర్‌పై ప్రజల్టో మరింత విశ్వసనీయత పెరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌జిల్లా క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై అధికార యంత్రాంగం కేసీర్‌ ఆదేశాలను గౌరవిస్తుందా? పెడచెవినపెడుతుందా వేచి చూడాల్సిందే…!

nega vargalu melkovali, నిఘా వర్గాలు మేల్కొనాలి….

నిఘా వర్గాలు మేల్కొనాలి….

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో భారీ అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. క్యాంపులో పనిచేయని భాయ్స్‌ పేర్లను పనిచేసిట్టుగా నమోదు చేసి, వారి వద్ద నుండి అకౌంట్లను సేకరించి దొంగదారిన, అక్రమంగా వారి అకౌంట్లలో వేసి తిరిగి వారి నుండి వసూలు చేసుకొని దొంగ అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్‌ ముట్టజెప్పారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ట్రావెలింగ్‌, స్టేషనరీ, పేపర్‌ వాల్యుయేషన్‌ చేసిన లెక్చరర్‌ల బిల్లుల విషయంలో కూడా లెక్కకు మించి తప్పుడు బిల్లులు పెట్టి ప్రభుత్వ సొమ్మును మెక్కాశారని విద్యార్థి సంఘాలు కలెక్టర్‌ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సాయిబాబా, లింగయ్యలను సస్పెండ్‌ చేయాలి

ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో భారీ అవినీతికి సూపరింటెండెంట్‌ సాయిబాబానే చక్రం తిప్పాడని ఆయనే క్యాంపుకు సంబంధంలేని వారి పేర్లను సేకరించారని, సేకరించిన పేర్లను, అకౌంట్లను ఓ మహిళా జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి సాయిబాబాకు ఇచ్చాడని విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తప్పుడు బిల్లులను తయారుచేయాలని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి అప్పగించగా వారు సాయిబాబా చెప్పినట్టుగానే దొంగ పేర్లతో బిల్లులు తయారు చేయగా, డిఐఈవో లింగయ్య ఈ తతంగానికి సహకరించి సంతకాలు చేశాడని, లింగయ్య అండదండలతోనే ఈ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. భారీ అవినీతికి పాల్పడిన సూపరింటెండెంట్‌ సాయిబాబాను, డిఐఈవో లింగయ్యను సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ను కోరుతున్నారు.

ప్రిన్సిపల్‌ సెక్రటరి జనార్ధన్‌రెడ్డిని కలవనున్న విధ్యార్థి సంఘాలు

ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో సూపరింటెండెంట్‌ సాయిబాబా, డిఐఈవో లింగయ్యలు కలిసి అవినీతికి పాల్పడినారని వీరిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే విచారణ కమిటినీ వేయాలని ఆర్జేడీకి, కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రలు ఇచ్చినా ఎలాంటి స్పందన రాకపోవడంతో నేరుగా ప్రిన్సిపాల్‌ సెక్రటరి జనార్ధన్‌రెడ్డిని కలిసేందుకు విద్యార్థి సంఘాలు సన్నద్దమవుతున్నాయి. ముందుగా ఇంటర్‌బోర్డు కార్యదర్శిని కలువాలనుకున్నారు, కాని అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని డిఐఈవో లింగయ్య ఎక్కడ మేనేజ్‌చేస్తారేమోనని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి. ఇంతకాలం నిర్లక్ష్యం జరగడానికి కారణం డిఐఈవో లింగయ్య కమీషనరేట్‌ నుండి కార్యాలయం వరకు ఆయనకున్న పలుకుబడి కారణంగానే కమిటీ వేయకుండా ఆలస్యం జరిగి ఉండవచ్చన్న అనుమానంతోనే నేరుగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ జనార్ధన్‌రెడ్డిని కలవనున్నామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

pattapagale veluguthunna vididepalu, పట్టపగలే వెలుగుతున్న విధిదీపాలు

పట్టపగలే వెలుగుతున్న విధిదీపాలు

వరంగల్‌ ఆరో డివిజన్‌ బెస్తంచెరువు మిట్టమధ్యాహ్నం వెలుగుతున్న విద్యుత్‌ దీపాలు. సబ్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో విద్యుత్‌ దీపాలు వెలుగుతున్నా విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని డివిజన్‌వాసులు అంటున్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న సబ్‌స్టేషన్‌ ఎఇ పట్టించుకోవడం లేదని డివిజన్‌వాసులు విమర్శిస్తున్నారు.

hospital eduta darna, హాస్పిటల్‌ ఎదుట ధర్నా

హాస్పిటల్‌ ఎదుట ధర్నా

పరకాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మంద శ్రీకాంత్‌, మడికొండ ప్రశాంత్‌ పట్టణ అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్‌ తెలిపారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హాస్పిటల్‌ ముందు ధర్నా చేపట్టామని అన్నారు.

vidyuth thigalu thagili okari mruthi, విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి

విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ భూమి ఫినిషింగ్‌ తీగలు గుచ్చుకుని ఒకరు మృతిచెందారు. మృతుడు ఎండి యాకూబ్‌ (40) అని, అతడు నందనం గ్రామవాసిగా గుర్తించారు.

raithula darna, రైతుల ధర్నా

రైతుల ధర్నా

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన రైతు నేరెళ్ల ఓదెలుపై రెవెన్యూ అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మండలకేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కసిరెడ్డి సాయిసుధా, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ramjan shubakankshalu telipina cp, రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీపీ

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీపీ

పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ముస్లీంలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి హన్మకొండ లోని బోక్కలగడ్డ ఈద్గాలో రంజాన్‌ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గోన్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండుగను ముస్లీంలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారని తెలిపారు. నెలరోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ప్రార్థనల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ప్రార్థనల్లో ముస్లిం పెద్దలు, చిన్నారులను అలింగనం చేసుకోని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం చిన్నారులకు పోలీస్‌ కమిషనర్‌ చాక్లెట్లు పంపిణీ చేశారు.

gananga ramjan vedukalu, ఘనంగా రంజాన్‌ వేడుకలు

ఘనంగా రంజాన్‌ వేడుకలు

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలకేంద్రంలో రంజాన్‌ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం మండలకేంద్రంలోని స్థానిక గెస్ట్‌హౌజ్‌లో ముస్లీంలు ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో అధికసంఖ్యలో ముస్లీంలు పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు అలాయ్‌బలాయ్‌ చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

kalushya nivaranaku krushi cheyali, కాలుష్య నివారణకు కృషి చేయాలి

కాలుష్య నివారణకు కృషి చేయాలి

ప్రజలందరూ కాలుష్య నివారణకు కృషి చేయాలని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వరంగల్‌ విభాగం ఆటవీశాఖ అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ జెండా ఊపి ప్రారంభించారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌ నుండి ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ మాట్లాడుతూ పీల్చే గాలి కాలుష్యం కావడంతో శ్వాసకోశ వ్యాధులతోపాటు ఇతర అరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రజలు పెట్రోల్‌, డీజిల్‌ లాంటి ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని ప్రజారవాణా వ్యవస్థకు వినియోగించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయడం, కాల్చడాన్ని తగ్గించాలని తెలిపారు. భవిష్యత్తు తరాలకు కాలుష్యం లేని పర్యావరణాన్ని అందించేందుకు తన వంతు భాధ్యతగా కాలుష్య నివారణకు కషి చేస్తానని చెప్పారు. అంతేకాకుండా ముమ్మరంగా మొక్కలను నాటేందుకు సిద్దపడాలని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

carlu dee, కార్లు ఢీ

కార్లు ఢీ

– ఒకరు మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జనగామ బైపాస్‌ రోడ్డుపై (ఇందిరమ్మ కాలనీ వద్ద) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు మతిచెందారు. జనగామ సీఐ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ని క్రమబద్దీకరిస్తూ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌ ఏఓ రాజేందర్‌, స్టేషన్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌లతో చర్చించారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను 15రోజులలో పరిష్కరించడానికి కషి చేస్తామని అన్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్‌లో ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, తద్వారా సంబంధిత రైల్వేశాఖ మంత్రి దష్టికి తీసుకొనివెళ్లి వాటి పరిష్కారానికి కషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిర్మల, చాంద్‌పాషా, భగవాన్‌, గడప శివ, జీవన్‌, జాఫర్‌, అలీం, రైల్వే నాయకులు మోతిలాల్‌, బిఎంఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

lekinpu kendralanu parishilinchina collector, లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నర్సంపేట డివిజన్‌లోని అన్ని మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.హరిత పరిశీలించారు. లెక్కింపు కేంద్రాలలో లెక్కింపు జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. తొలుతగా ఎంపిటిసి, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టి సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.

జనరల్‌ ఎన్నికల అబ్జర్వర్‌ పరిశీలన ….

జనరల్‌ ఎలక్షన్‌ అబ్జర్వర్‌ బి.శ్రీనివాస్‌ జడ్పీటిసి ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంలో లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. లెక్కింపు జరిగే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

greaterlo dongala gang, గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌

గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌

గ్రేటర్‌ నగరంలో దొంగల గ్యాంగ్‌ భయపెడుతోంది. 8మంది సభ్యులున్న ఈ గ్యాంగ్‌ తాళం వేసి ఉన్న, ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం కాజీపేట చైతన్యపురి ప్రాంతంలో అర్థరాత్రి ఓ ఇంటి కిటికి ఊచలు కట్‌ చేస్తుండగా అప్రమత్తమైన ఇంటి యజమానులు గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న ఈలోపే దొంగల గ్యాంగ్‌ పారిపోయింది. అయితే చైతన్యపురి ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పుటేజీ సంపాదించారు. ఈ పుటేజీ ఆధారంగా దొంగల వివరాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. సీసీ టివి పుటేజి ఆధారంగా కూపి లాగుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌

కాజీపేట పట్టణంలో దొంగల ముఠా తిరుగుతున్నట్లు ప్రజలు కాలనీలల్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలల్లో దొంగల ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుండటంతో ప్రజలు బయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం కాజీపేట చైతన్యపురి కాలనీలో ఈ దొంగల ముఠా ఓ ఇంటలో దొంగతనానికి ప్రయత్నిస్తుండగా యజమాని అప్రమత్తమై వారిని ఎవరు అని ప్రశ్నించేలోపే వారు అక్కడి నుండి పరారయినట్లు పోలీసులు తెలిపారు. 100 డయల్‌ చేయడంతో కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ తన సిబ్బందితో వెళ్లి గాలించగా అప్పటికే దొంగలు పరారు అయ్చారని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’ ప్రతినిధితో సీఐ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కాజీపేట పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే 100 డయల్‌ చేసి సమాచారమివ్వాలని అన్నారు. చైతన్యపురిలో దొంగతనానికి ప్రయత్నించిన దొంగలముఠా కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

dieo officelo padakagada…siggu…siggu, డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు

డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో కొందరు రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిగా మార్చుకొని ఉంటున్న విషయాన్ని ‘నేటిధాత్రి’ ప్రభుత్వకార్యాలయమా..? పడకగదా..? అనే శీర్శికతో పాఠకుల ముందుకు తీసుకువచ్చింది. రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిలా మార్చుకొని ఉంటుండడాన్ని ప్రజలు, ఉద్యోగ సంఘాల నేతలు, విధ్యార్థి నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బాధ్యతగా, హుందాగా వ్వవహరించాల్సిన డిఐఈవో ఈ విదంగా కార్యాలయానికి చెడ్డ పేరు తేవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కార్యాలయానికి వెళ్లాలంటేనే సిగ్గుగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికి కార్యాలయంలో ఉంటున్నది ఎవరనేది అంతుచిక్కడంలేదని ఇంతలా దిగజారి కార్యాలయానికి తలవంపు తెస్తారని అనుకోలేదని ఉద్యోగులు సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.

తలవంపులు తెస్తున్నా డిఐఈవోపై చర్యలు శూన్యం

విలువలను, హూందాతనాన్ని, ఉద్యోగుల నైతికతను, బాధ్యతను, గౌరవాన్ని, వృత్తిధర్మాన్ని మంటగలుపుతూ డిఐఈవో కార్యాలయ పరువును బజారుకీడుస్తున్న డిఐఈవో ఒంటెద్దుపోకడతో ఉగ్యోగలమంతా తలదించుకున్నంత పని అయిందని, కార్యాలయానికి వెళ్లాలంటేనే చాలా సిగ్గుగా ఉందని కొందరు ఉద్యోగులు అంటున్నారు. ఓ వైపు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ, మరో వైపు నీతిమాలిన పనులు ఏకంగా కార్యాలయాన్నే అడ్డగా మార్చుకొని వ్యవహరిస్తున్నారా..? అనే కోణంలో ‘నేటిధాత్రి’లో కథనాలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిఐఈవోకు ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లనే ఆయన వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

మండిపడుతున్న విద్యార్థి, ఉపాద్యాయ సంఘాలు

ప్రభుత్వ కార్యాలయమా…? పడక గదా..? అనే కథనం బయటికి రావడంతో జిల్లా వ్యాప్తంగా డిఐఈవో కార్యాలయం గురించి, లీలలపై, అవినీతి, అక్రమాలపై ప్రతిఒక్కరు చర్చించుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగ, ఉపాద్యాయ, లెక్చరర్ల సంఘాల నేతలు డిఐఈవోపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం కొన్ని ఉపాద్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విషయంపై కలెక్టర్‌కు, ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌కు కలిసి వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు

గ్రేటర్‌ వరంగల్‌ నగరంతో సహా వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల హవా కొనసాగుతుంది. సమస్య ఏదైనా అందులో తలదూర్చి సెటిల్‌మెంట్‌ చేస్తామని చెప్పడం ఈ గ్యాంగ్‌ల ప్రత్యేకత. సమస్య ఏదిలేకున్న వీరే తమ సొంత తెలివితేటలతో సమస్యలను సృష్టించి ఆ సెటిల్‌మెంట్‌ వీరివల్లే అయ్యేవిధంగా చేసి పరిష్కారం చేస్తామని చెప్పి డబ్బులు దండుకోవడం వీరు అలవాటు చేసుకున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీరి బాధితులు అధికసంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది సమస్య పరిష్కారం కోసం పోయి ఉన్న ఆస్తిని పొగుట్టుకున్న ఉదందాలు సైతం ఉన్నాయని తెలిసింది.

గొడవ ఏదైనా సరే

గొడవ ఏదైనా సరే అందులో కలగజేసుకోవడం సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు అలవాటు చేసుకున్నాయి. పోలీస్‌స్టేషన్‌ సమస్యలు, భూవివాదాలు, కుటుంబ గొడవలు తదితర విషయాల్లో ఈ సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు. కలగజేసుకుని పరిష్కారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుని బాదితులను ఇబ్బందులకు గురిచేస్తుంటారట. సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు ప్రధానంగా భూవివాదాల్లో కలగజేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాయట. భూమిలో సగం తమకు అప్పగిస్తే లేదంటే మార్కెట్‌ రేటు ప్రకారం తమకు కమీషన్‌ చెల్లిస్తే సమస్య పరిష్కారం చేస్తామని నమ్మబలికి అందినకాడికి అందుకుపోవడం ఈ గ్యాంగ్‌లు చేస్తుంటాయట. కొన్ని సందర్భాల్లో భూవివాదాల్లో ఇరువర్గాలు వీక్‌ అని తెలిస్తే భూమిని తమ పేర చేసుకుని సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు అసలు హక్కుదారులకు చుక్కలు చూపిస్తారట.

పరిచయాల పేరుతో బురిడీ

సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల మరో ప్రత్యేకత ఏంటంటే పరిచయాలతో బురిడీ కొట్టించడం తమకు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ఇతర గ్యాంగ్‌లు చాలా దగ్గర అని చెపుతూ సమస్యను తామే పరిష్కరిస్తామని చెప్పడం వీరికి వెన్నతో పెట్టిన విద్యేనట. నిజానికి ఇలాంటి గ్యాంగ్‌లకు కొంతమంది పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు అండగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరైన సమస్యలతో వీరి వద్దకు వస్తే ఫలానా గ్యాంగ్‌ దీన్ని సెటిల్‌ చేస్తుందని అక్కడకు వెళ్లండని సూచిస్తున్నట్లు తెలిసింది. సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు ఏది సెటిల్‌ చేసిన అది నిజమేనని కొంతమంది పోలీస్‌ అధికారులు నిర్థారిస్తూ ఆ సెటిల్‌మెంట్‌కు అదికార ముద్ర వేస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని కొన్ని పోలీస్‌స్టేషన్‌లలో సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల హవా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారిందంటే చాలు సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోనే తచ్చాడుతూ ఉంటారట.

సంవత్సరాలపాటు సాగదీత

ఇరువర్గాలను తమ చేతిలో ఉంచుకుని సమస్యను పరిష్కారం ఏయకుండా సంవత్సరాలపాటు సాగదీయడం సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు బాగా అలవర్చుకున్నాయట. గ్యాంగ్‌ల సాగదీతకు జడుసుకున్న కొంతమంది ఇరువర్గాలు ఏకమై తమ సమస్యను తామే పరిష్కారం చేసుకున్న సందర్బాలు ఉన్నాయట. గ్యాంగ్‌ల సాగదీత పరిష్కారాల మూలంగా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు అనేకం ఉన్నాయట. సమస్యను పరిష్కారం చేయాలంటే ఉదయం అల్పాహారంతో మొదలుకుని మందు, విందు వరకు అన్ని బాధితులే చూసుకోవాలట. ఈ ఖర్చు పెట్టలేక కొంతమంది బాదితులు అప్పులపాలైన సందర్బాలు ఉన్నాయి.

సెటిల్‌మెంట్లే ఉపాధి

ఇస్త్రీ పోల్డ్‌ నలగని చొక్క, చుట్టు మంది మార్బలం ఏర్పాటు చేసుకుని కాసింత బిల్డప్‌ కలగలుపుకుని సెటిల్‌మెంట్‌ గాండ్లు దర్శనమిస్తారట. సెటిల్‌మెంట్లనే ఉపాధిగా చేసుకుని బతుకుతున్న వీరు కేవలం వీటిపైన ఆధారపడి బాధితులను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు వెనకేసిన వారు ఉన్నారట. భూసమస్యల్లో తలదూర్చిన సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లైతే సమస్యను పరిష్కారం చేయకుండా ఎంతో కొంత నగదు ముట్టజెప్పి బాధితుల వద్ద నుంచి కారుచౌకగా భూములు దండుకున్నవారు ఉన్నారట. మొత్తానికి సెటిల్‌మెంట్‌ ఉపాధి చేసుకుని బాధితుల బలహీనతలు ఆసరా చేసుకుని జీవితాలను ఆగం చేసిన వారు ఉన్నారట.

jailashaka incharge igga b.saidaiah, జైళ్లశాఖ ఇంఛార్జి ఐజీగా బి.సైదయ్య

జైళ్లశాఖ ఇంఛార్జి ఐజీగా బి.సైదయ్య

తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ ఐజీ ఆకుల నర్సింహ మే 30న పదవి విరమణ పొందడంతో ఇంచార్జి ఐజీగా బి.సైదయ్యను నియమిస్తూ జైళ్లశాఖ డీజీ ఎం.వినయ్‌కుమార్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సైదయ్య ప్రస్తుతం హైదరాబాద్‌ రేంజ్‌ జైళ్ల శాఖ డిఐజిగా విధులు నిర్వహిస్తున్నారు. 2018లో రాష్ట్రపతి అవార్డు ఎంపిక అయిన ఇతనికి జైళ్ల శాఖలో మంచి గుర్తింపు ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version