కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించి నిండా మునిగిన రైతులు

కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌..

`సూర్యపేట ఎమ్మెల్యే ,రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక లో కాంగ్రెస్‌ పరిపాలన వాస్తవ పరిస్థితులు.

`జాలి పడితే మిగిలేవి కన్నీళ్లే!

`తెలంగాణ మళ్లీ యాభై ఏళ్ల వెనక్కే!

`ఇళ్లకు కోతలే…వ్యాపార సంస్థలకు వాతలే!

`ఇష్టాను సారం బిల్లుల మోతలే.

`తెలంగాణ కాంగ్రెస్‌ నేతలవన్నీ ప్రగల్భాలే!

`కష్టాల కర్నాటక… కరంటు కటకట!

`తెలంగాణ లో కరంటు వెలుగులు…

`కర్నాటక లో కాంగ్రెస్‌ పుణ్యమా అని చీకట్లు.

`కరంటు లేమికి సాక్ష్యం కర్నాటక.

`ఆరు నెలల్లో అంతా తారుమారు.

`కాంగ్రెస్‌ ను గెలిపించి నిండా మునిగిన రైతు.

`రైతులు రోడ్డెక్కి ధర్నాలు..నిరసనలు.

` రైతులకు ఐదు గంటలకన్నా కరంటివ్వలేమంటున్న సర్కారు.

`ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ తీరు.

`కాంగ్రెస్‌ చెబుతున్నవన్నీ అబద్దాలే!

`అధికారం కోసం ఆరాటం.

`దుర్మార్గపు కాంగ్రెస్‌ రాజకీయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే అబద్దాల పుట్ట. కర్నాటకలో అధికారంలోకి వచ్చిందని ఇక పులినిచూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కాంగ్రెస్‌ వ్యవహారం చూస్తే విచిత్రమనిపిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒక్క శాతం కూడా. ఈ పదేళ్లలో ప్రభుత్వం మీద ప్రజలు ఒక్క రోజు కూడా నిరసన తెలియజేసిన సందర్భం లేదు. అంతగొప్పగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలన సాగుతోంది. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి స్ధానమే లేదు. కాని నిత్యం అబద్దాలు వల్లెవేస్తూ, నిజాలను కప్పిపుచ్చుకుంటూ, కేవలం పదవుల కోసమే రాజకీయాలు చేసే కొందరు స్వార్ధపరులు కాంగ్రెస్‌లో చేరినంత మాత్రాన బపడినట్లు కాదు. కాంగ్రెస్‌కు బలం చేకూరిచనట్లు కాదు. కాంగ్రెస్‌ చెబుతున్న హమీలన్నీ ఇప్పటికే తెలంగాణలో అమలు చేస్తున్నవే. కాంగ్రెస్‌ కొత్తగా చెప్పిందేమిటి? ఇస్తామంటున్నదేమిటి? దేశంలో డెబ్బ్కె ఏళ్ల స్వతంత్య్రంలో ఏనాడు రైతుల గురించి ఆలోచించింది లేదు. ఇంతపెద్ద దేశంలో కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన దేశంలో ప్రాజెక్టుల నిర్మాణాల మీద దృష్టిపెట్టలేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కాంగ్రెస్‌ కట్టింది లేదు. అరవైఏళ్ల తెలంగాణను గోసపెట్టిన పార్టీయే కాంగ్రెస్‌. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు కొత్తగా కర్నాటక అంటూ భజన చేస్తున్నారు. ఏముంది కర్నాటకలో కరంటు లేదు. రైతులకు కరంటు ఇవ్వడం లేదు. కేవలం ఐదు గంటలు మాత్రమే ఇవ్వగలమంటూ అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రకటన చూస్తున్నాం. రైతులు రోడ్డెక్కి నిరసలను తెలియజేస్తున్న సందర్భం చూస్తూనే వున్నాం. పంటలు ఎండిపోయే పరిస్దితి ఎదురౌతుందని రైతులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. గొప్పగా చెప్పుకునే కర్నాటకలో ఇండ్లకు కూడా సరిగ్గా కరంటు సరఫరా చేయడంలేదు. హోటల్స్‌ బిజినెస్‌ వ్యాపారులు కరంటు కోతలపై నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఇక దోపిడీకి అంతే లేదు. ఏకంగా అక్కడి నాయకుల పేరుతోనే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలు చీదరించుకుంటున్నారన్న సోయి కూడా లేకుండా కర్నాటక గెలిచాం..గ్యారెంటీలు ఇచ్చాం… అని చెప్పుకోవడం కాదు…బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటినే కాపీ కొడుతూ కూని రాగాలు తీస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్‌ పార్టీ సభలకు ఎంత మంది వస్తున్నారో చూస్తున్నాం. రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీలు వస్తే తప్ప రాజకీయం నడవని నేతలు రాష్ట్రాన్ని నడిపిస్తారా? ఇలాంటి పరాన్న జీవుల్లాంటి నాయకులను చూసి ప్రజలు ఓట్టేస్తారా? అంటున్న సూర్యపేట ఎమ్మెల్యే ,రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో చెప్పిన కర్నాకట వాస్తవ పరిస్ధితులు, తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్‌ అంటేనే కరంటు కోతలు.
తెలంగాణ అరవై ఏళ్లపాటు చూసిందే..ఇప్పుడు కర్నాకటలో చూస్తున్నదే. కర్నాకటలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమేమిటో ప్రజలకు తెలుసు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతుల మసిబూసి మారేడు కాయ చేస్తామంటే ఎవరూ నమ్మరు. పైగా ఓటుకు నోటు కేసులో వున్న దొంగను నమ్మి పార్టీ అప్పగించిన కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారా? అసలు కర్నాటకలో ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆఖరుకు చెత్త సేకరణకు ముందుకొచ్చే ఎజెన్సీలనుంచి కూడా వసూలు చేస్తున్నారంటే కాంగ్రెస్‌ పనితనమేమిటో? ఆ పరిపాలన ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. గత పాలకులు బిజేపి పూర్తిగా అవినీతి మయమైపోవడం వల్ల ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. అదేదో గొప్పగా , తెలంగాణలో కూడా మేమే అంటూ కలలు కంటున్నారు. వాళ్లకు మిలిలేవి కలలే.. ఆ కలల్లోనే వాళ్లు ఊరేగాల్సిందే. తప్ప..తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఎప్పటీకి కాంగ్రెస్‌కు వుండదు. ఇప్పటికీ కనీసం టిక్కెట్ల ఖరారుకే దిక్కులేదు. అలాంటి కాంగ్రెస్‌ నాయకుల చేతుల్లో పాలన పెడితే ప్రజల జీవితాలు ఆగమే…అరవైఏళ్లపాటు తెలంగాణ ప్రజలు కొట్లాడిరదే కాంగ్రెస్‌ మీద. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్‌. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంద్రలోకలిపిందే కాంగ్రెస్‌. ఇప్పుడేదో కొత్తగా తెలంగాణ మేమే ఇచ్చామని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడాలి. ప్రజల మీద ప్రేమతో కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన ఉద్యమంతో అనివార్యమై ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ మీద తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో పద్నాలుగేళ్లపాటు నిరంతరం ఉద్యమం చేశారు. ఎంతో మంది యువత బలయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్షతో దిగివచ్చారు. అప్పడు తెలంగాణ ప్రకటన చేశారు. అంతే కాని అడగగానే చాక్లెట్‌ చేతిలో పెట్టినట్లు ఇచ్చినట్లు ఎంతో సుతారంగా చెబుతున్నారు. అలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడని తత్వం కాంగ్రెస్‌ నేతలది. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని ఇక తప్పని పరిస్దితుల్లో తెలంగాణ ఇచ్చారు. ఇవ్వకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని ఇచ్చారు. అంతే గాని తెలంగాణ మీద ప్రేమతో కాదు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే తెలంగాణ ప్రజల్లో గుండెల్లో వున్నది కేసిఆర్‌. తెలంగాణ కలలు నెరవేర్చే నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చాడు. ప్రజల కష్టాలు తీర్చాడు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యాడు. ఆడపిల్లలకు మేమమాయ్యాడు. ఆసరాతో కుటుంబాలను ఆదుకుంటున్నాడు. కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడపిల్లల పెళ్లి చేస్తున్నాడు. తల్లి బిడ్డల క్షేమం చూస్తున్నాడు. అమ్మ కాబోతున్న తల్లులను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తల్లి గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం దాకా, తల్లి బిడ్డ క్షేమంగా ఆసుపత్రిని నుంచి ఇంటికి చేర్చుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇదీ మన తెలంగాణ గొప్పదనం. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఔదార్యం. ఇంత గొప్ప ప్రభుత్వం వుండగా, ఏనాడు ప్రజల యోగక్షేమాలు పట్టని కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించడం అన్నది కల్ల.
తెలంగాణ అంటేనే ఓ అధ్భుతం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన అంటేనే ఓ స్వర్ణయుగం. ఎందుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కరంటు కోతలతో తెలంగాణ విలవిలలాడిరది. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో తెలంగాణ వెలుగులతో నిండిరది. ఆరు నెలల్లో అసలు కరంటు సమస్య అన్నది లేకుండాపోయింది. ఇండ్లకు ఇరవై నాలుగు గంట కరంటు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అరవైఏళ్లలో ఏ ఒక్కనాడు ఇరవై నాలుగు గంటల కరంటు తెలంగాణ ప్రజలు చూసింది లేదు. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే రెప్పపాటు కూడా పోకుండా కరంటు చూస్తోంది. ఇదీ కేసిఆర్‌ నాయకత్వానికి, పాలనకు నిదర్శనం. మరి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇరవైనాలుగు గంటల నిర్విరామ కరంటు ఎందుకు సరఫరా కావడంలేదు. సాక్ష్యాత్తు దేశ రాజదానిలో కూడా కరంటుకోతలు చూస్తున్నాం. కాని తెలంగాణలో ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏనాడు కోత చూసింది లేదు. ప్రజలు ఇబ్బంది పడిరది లేదు. రైతులకు కష్టం కలగలేదు. అర్ధరాత్రులు రైతులు కరంటు కోసం బావుల వద్దకు వెళ్లింది లేదు. అక్కడ నిద్రలు చేసింది లేదు. తెలంగాణలో వున్నది బిఆర్‌ఎస్‌ సంక్షేమ ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం. పేదల ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న గొప్ప పరిపాలనకు నిలయం. అలాంటి తెలంగాణలో మరో పార్టీ అధికారంలో వచ్చే అవకాశమే లేదు. కర్నాకట పేరు చెప్పుకుంటే పడే ఆ కాస్త ఓట్లు కూడా పోతాయి. ముందు కాంగ్రెస్‌ అది తెలుసుకుంటే మేలు..కాంగ్రెస్‌ను ఆదరిస్తే మళ్లీ తెలంగాణను చీకట్లోకి తీసుకెళ్తారు. తెలంగాణను ఆగం చేస్తారు..ప్రజలు బాగా ఆలోచించాల్సిన సమయం. మోసం చేసేవాళ్లు చాలా చెప్తారు. నమ్మించి ఆగం చేస్తారు. బిఆర్‌ఎస్‌ ప్రజలను గుండెల్లో పెట్టుకునేపార్టీ. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రికేసిఆర్‌. మూడోసారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ విజయం తధ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!