UPI మాయాజాలం! ఎంత సంపాదించినా.. అప్పు!

UPI మాయాజాలం!
ఎంత సంపాదించినా.. అప్పు!

 

 

 

నెలకు భారీగానే సంపాదన ఉంది. జీతం చేతిలో పడగానే.. ఈ నెల ఇంత పొదుపు చేయాలని అనుకుంటాం.. రోజులు గడుస్తుంటాయి.. నెలాఖరు వచ్చేస్తుంది. తీరా చూస్తే అకౌంట్లో డబ్బులు నిల్లు.. మళ్లీ అప్పు చేసే పరిస్థితి. అసలు డబ్బులు ఎక్కడ ఎలా ఖర్చవుతున్నాయి.. అసలు సమస్య ఎక్కడ ఉంది.. ఖాతాలో డబ్బులు ఎక్కడికి పోతున్నాయంటే.. ఇదంతా UPI మాయాజాలం అంటున్నారు ఆర్థిక నిపుణులు. చేతిలో స్మార్ట్ ఫోన్.. ఖాతాలో డబ్బు.. ఇంకేముంది ప్రతి చోటా స్కాన్ చేయడం.. డబ్బులు చెల్లించడం. తీరా చూస్తే నెలాఖరుకి చేతిలో డబ్బులు మాయం. ఈ పరిస్థితి వెనక ఉన్న ప్రధాన కారణం UPI చెల్లింపులు అంటున్నారు.

దేశంలో యూపీఐని వేగవంతం, సులభతరం చేసినప్పటికీ.. ఖర్చు చేయడం కూడా అలానే మారింది. చూడ్డానికి ఈజీగా కనిపించే ఈ యూపీఐ పేమెంట్స్.. నిశ్శబ్దంగా మీ నెలవారీ బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి అంటున్నారు ఆర్థిక నిపుణులు.

UPI వల్ల చేతిలో నగదు తీసుకెళ్లాల్సిన పని లేదు. ఒక చిన్న స్కాన్ చేస్తే పని అయిపోతుంది. ఇక్కడ భౌతికంగా డబ్బు చేతులు మారడం లేదు, నోట్లు లెక్కించే అవకాశం ఉండదు, అందుకే ఖర్చు చేసేటప్పుడు పెద్దగా ఆలోచన రాదు. చివరకి ఇది ప్రణాళిక లేని ఖర్చులకు దారితీస్తుంది. రోజంతా మనం చేసే ఈ చిన్న చిన్న కొనుగోళ్లు విడివిడిగా చూస్తే తక్కువగానే అనిపించవచ్చు, కానీ అవన్నీ కలిస్తే నెల చివరికి పెద్ద మొత్తంగా మారుతాయి. ఈ చిన్న చిన్న ఖర్చులు మన మెదడులో పెద్దగా నమోదు కావు. కానీ ఈ అదృశ్య ఖర్చులు అన్నీ కలిసి.. మీ నెలవారీ పొదుపును హరిస్తున్నాయి అంటున్నారు.

మీరు చేతి నుంచి నగదు రూపంలో డబ్బులు చెల్లిస్తే.. అప్పుడు మీ చేతి నుంచి డబ్బు స్వయంగా ఖర్చవ్వడం మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఇది మీ మెదడుకు హెచ్చరికలా పని చేస్తుంది. దీంతో డబ్బులు ఖర్చు చేసే విషయంలో అప్రమత్తం అవుతాం. కానీ అదే UPI డిజిటల్ కావడంతో ఆ మానసిక భయం కలగదు. దీంతో జనాలు తాము ఎంత ఖర్చు చేస్తున్నామనే అంశం అర్థం కాదు. ఫలితంగా తెలియకుండానే డబ్బులు ఖర్చవుతాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version