పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్బంగా రక్తదాన శిభిరం ఏర్పాటు
పరకాల,నేటిధాత్రి
పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా మంగళవారంరోజున పట్టణంలోని డిపిఆర్ ఫంక్షన్ హల్ లో డివిజన్ పోలీస్ ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.సిఐలు క్రాంతి కుమార్,రంజిత్ రావు,సంతోష్ రక్తదాన శిబిరాన్ని ప్రారంబించి మాట్లాడుతూ రక్తదానం చేయడం అత్యంత మహత్తరమైన సేవ,ఒక్క యూనిట్ రక్తంతో ముగ్గురు ప్రాణాలను రక్షించగలమనే సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలని పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంలో ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ చేయడమే కాకుండా అమరవీరుల త్యాగాలను స్మరించడమన్నది కూడా మన బాధ్యత అని పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు,యువత స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమని దాదాపు 180మంది వరకు రక్తదానం చేసారని పేర్కొన్నారు.అనంతరం పాల్గొన్న రక్త దాతలకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ ఎస్సైలు,పోలీసు సిబ్బంది,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
