బీరప్ప స్వామి-కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఘనంగా
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్ మండల కేంద్రంలోని డప్పూర్ గ్రామ శివారులో ఆదివారం, మే 3, 2026న శ్రీ బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం కురుమ సంఘాల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు కలశాలతో ఊరేగింపులో పాల్గొనగా, డోలు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ఈ మహోత్సవం కురుమల ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని స్థానికులు తెలిపారు.
