మండలంలో బంద్ విజయవంతం
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు
మహాదేవపూర్ జూలై 23 (నేటి ధాత్రి )
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో బుధవారం రోజున విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతం అయిందని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర,రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు బంద్ నిర్వహణ లో భాగంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమార్ రాజు మాట్లాడుతూ మండలం లోని విద్య రంగ సమస్యలు పరిష్కరించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలనీ, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలనీ, రెగ్యులర్ ఎంఈఓ డీఈవో పోస్టులను భర్తీ చేయాలనీ, అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలనీ, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలనీ, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలనీ, నూతన జాతీయ విద్యా విధానం 2020 ను రద్దు చేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలిచేయాలనీ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలనీ అన్నారు.