5వ.తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
బెల్లంపల్లి నేటిధాత్రి :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో చేరికల కొరకు మళ్ళీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నీలు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మైనారిటీ విద్యార్థినులు ధ్రువీకరణ పత్రాలతో కళాశాలకు వచ్చి ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కళాశాలలో ఎంసెట్ శిక్షణ సైతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.