ముస్లింల షాదీఖాన శంఖుస్థాపన కార్యక్రమానికి ముస్లింలందరు తరలిరావాలి
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండల ముస్లిం కుల సంఘం మరియు మండల ముస్లింల షాదీఖాన నిర్మాణ కమిటీల సమావేశం సోమవారం కేసముద్రం విలేజ్ మసీదులో నిర్వహించడం జరిగింది. కుల సంఘం అధ్యక్షులు షేక్ ఖాదర్ మరియు షాదిఖాన నిర్మాణ కమిటీ అధ్యక్షులు షేక్ మహ్మద్ అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసముద్రం మండల ముస్లిం ప్రజల సౌకర్యార్ధం షాదిఖానా నిర్మాణానికి 80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి, శంఖుస్థాపన చేస్తున్న ముఖ్య మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం మండల షాదీఖాన శంఖుస్థాపన కార్యక్రమం ఉన్నందున కేసముద్రం మండలంలోని ముస్లింలందరు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కుల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ నయీం, షాదిఖానా నిర్మాణ కమిటీ కోశాధికారి షేక్ అక్బర్, కేసముద్రం విలేజ్ దర్గా సదర్ మహ్మద్ అమీర్ పాష, మాజీ సదర్ షేక్ యాకుబ్ పాష, కల్వల గ్రామ సదర్ మహ్మద్ పాషా, మహ్మద్ సైదులు, మహమ్మద్ గఫార్, షెక్ యూసుఫ్, షేక్ మహ్మద్, షేక్ అజారుద్దీన్, షేక్ సైదులు పాల్గొన్నారు.