మొగుళ్ళపల్లి తహసిల్దార్ కార్యాలయ బ్యాంక్ అకౌంట్స్ వివరాలు ఇవ్వండి,
చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్.( ఆర్టిఐ సమాచార హక్కు చట్టం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు)
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జూలై నుండి 2025 జులై వరకు మొగుళ్లపల్లి తాసిల్దార్ బ్యాంక్ అకౌంట్ (ఎస్బిఐ) జమ ఖర్చు వివరాలు జిరాక్స్ కాపీలు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఇవ్వాలని సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమాచార హక్కు చట్టం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు చెర్లపల్లి వెంకటేశ్వర్ గౌడ్ మొగుళ్లపల్లి తాసిల్దార్ సునీతకు ఆర్టిఐ ఫార్మాట్లో దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ గతంలో తహసిల్దారు గా సుమన్ పనిచేసిన అప్పటినుండి ఇప్పటివరకు మొగుళ్ళపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ప్రభుత్వము నుండి మరియు ఇసుక అక్రమ రవాణా చేసిన క్రమంలో విధించిన పెనాల్టీల ద్వారా ఎంత జమ అయ్యాయి కార్యాలయ మెయింటెనెన్స్ కోసం ఎంత ఖర్చు అయ్యాయి అన్న వివరాలు ఇవ్వాలని స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.