అఖిల భారత మానవ హక్కుల పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఇట్టిరెడ్డి శ్రీపాల్,రామడుగు మండల అధ్యక్షులుగా పీచు ఇంద్రారెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీకాకోలో ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల ఆనంద్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ కౌన్సిల్ మీట్టింగ్ ను నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన ఇట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డికి, రామడుగు మండల అధ్యక్షులుగా నియమితులైన పీచు ఇంద్రారెడ్డిలకి ఐడికార్డు, నియామక పత్రాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలువల ఆనంద్ చేతుల మీదుగా అందజేయడం జరిగినది.
ఈసందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ కౌన్సిల్ గురించి సూచనలు సలహాలు వారికి అవగాహన కల్పించి, నియామక నిబంధనలకు లోబడి ఏదైనా సమాచారం అందిన వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో చొప్పదండి మండల అధ్యక్షులు దుబ్బాక మల్లేశం, పిండి శ్రీనివాస్ రెడ్డి, ఇట్టవేణి రాములు, పొన్ను లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
