నటి నోరా ఫతేహీ కారుకు ప్రమాదం.. ఏం జరిగిందంటే…

నటి నోరా ఫతేహీ కారుకు ప్రమాదం.. ఏం జరిగిందంటే?

 

ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు ఈ బాధ తప్పడం లేదు. ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.

బాలీవుడ్ అందాల నటి, ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహి (Nora Fatehi) పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ముంబయి(Mumbai)లో అమెరికన్ డీజే(American DJ) డేవిడ్ గెట్టా (David Guetta) ఏర్పాటు చేసిన సంగీత కచేరీ (Music concert) కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారును ర్యాష్‌గా వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం(Accident)లో ఆమెకు స్వల్పంగా గాయాలు(Minor injuries) కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి (Health condition) నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కారు ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ (Driver) వినయ్ సక్పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రతి సంవత్సరం గోవా(Goa) లో జరిగే సన్బర్న్ ఫెస్టివల్ (Sunburn Festival 2025)ఈసారి ముంబయిలో జరుగుతోంది. ఈ నెల 19న ఫెస్టివల్ ఘనంగా ప్రారంభించారు. నోరా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా అంబోలి లింక్ రోడ్డు (Amboli Link Road) వద్ద ఈ ప్రమాదం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and driving) సెక్షన్ల కింద డ్రైవర్ వినయ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు ముంబయి పోలీసులు(Mumbi Police). మద్యం మత్తులోనే కారు నడిపి యాక్సిడెంట్ చేశాడని పోలీస్ అధికారు తెలిపారు. నటీ,సింగర్, డ్యాన్సర్ గానోరా ఫతేహి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నోరా చేతిలో ఇప్పుడు ‘కాంచన 4’, ‘KD: ది డెవిల్’ తో పాటు ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ‘ది రాయల్స్’ అనే వెబ్ సీరీస్ లో నటిస్తుంది.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version